Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. సల్మాన్ ఖాన్, అతని తండ్రిని చంపేస్తామంటూ ఆగంతకుడు లేఖ రాశాడు. పంజాబీ సింగర్ సిద్దూకు పడిన గతే పడుతుందని లేఖలో హెచ్చరించాడు. వెంటనే అప్రమత్తమైన బాలీవుడ్‌ హీరో..బాంద్రా పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఆగంతకుడి లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లేఖను ఎవరు రాశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. సల్మాన్ తండ్రి సలీంఖాన్‌ జాగింగ్‌కు వెళ్లిన సమయంలో బెదిరింపు లేఖ వచ్చినట్లు తెలుస్తోంది. అతడు కూర్చున్న కుర్చీపై లేఖ కనిపించింది. సిద్ధూ హత్య తర్వాత హీరో సల్మాన్‌ ఖాన్‌కు సైతం భద్రతను పెంచారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ ఖాన్‌ ప్రమేయం ఉండటంతో..అతడిని చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించింది. ఈక్రమంలో సల్మాన్‌కు భద్రతను రెట్టింపు చేశారు.


మరోవైపు ఇటీవల పంజాబ్‌లో సింగర్,కాంగ్రెస్‌ నేత సిద్ధూ మరణం తీవ్ర కలకలం రేపింది. సింగర్ కాన్వాయ్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈఘటనలో సిద్దూ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీవీఐపీలకు భద్రతను ఉపసంహరించుకున్న రెండురోజుల్లో ఈ ఘటన జరగింది. దీనిపై రాజకీయ దుమారం రేగడంతో అక్కడి మాన్‌ ప్రభుత్వం ..వెనక్కి తగ్గింది. వీవీఐపీలకు భద్రత పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈనెల 7 నుంచి భద్రత రెట్టింపు కానుంది.




Also read: Shankaramma Comments: నా జోలికి వస్తే కాళ్లు విరగ్గొడతా..కేఏ పాల్‌పై శంకరమ్మ మండిపాటు..!


Also read:Karan Johar Birthday: కరణ్‌ జోహర్‌.. పార్టీ ఇచ్చావా లేదా కరోనా వైరస్‌ను ఇచ్చావా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook