Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ ఈమధ్య వరుస సూపర్ హిట్లతో కెరియర్ లో ముందుకు దూసుకుపోతున్నారు. అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో రెండు వరుస బ్లాక్ బస్టర్లు అందుకున్న బాలయ్య తాజాగా విడుదలైన భగవంత్ కేసరి సినిమాతో మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. సీనియర్ హీరో అయినప్పటికీ హాట్రిక్ హిట్లతో యువ హీరోలకి సైతం షాక్ ఇచ్చారు బాలయ్య.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక వచ్చే ఏడాదికి కూడా బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీ కాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది పూర్తి చేయడానికి బాలయ్య కి మూడు కోరికలు ఉన్నాయట. అవి ఏంటి ఎప్పటికి నెరవేరుతాయి అని అభిమానులు కూడా ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. అయితే బాలకృష్ణకి ఉన్న మొదటి కోరిక తన తనయుడు నందమూరి మోక్షజ్ఞ గురించి అని తెలుస్తోంది.


నందమూరి మోక్షజ్ఞ ఎప్పుడు హీరోగా ఇండస్ట్రీకి అడుగు పెడతాడా అని నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఆసక్తి ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ను ఇండస్ట్రీలో హీరోగా లాంచ్ చేయాలని కోరుకుంటున్నారట. ఎప్పటినుంచో బాలకృష్ణ కి ఈ ప్లాన్ ఉందని కానీ ఖచ్చితంగా వచ్చే ఏడాది అది నిజమయ్యేలా చూడాలని ప్లాన్ చేస్తున్నారట.


ఇక బాలయ్య రెండవ కోరిక తన కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ లలో ఒకటిగా నిలిచిన ఆదిత్య 369కి సీక్వెల్ గా ఆదిత్య 999 మాక్స్ ని తీయటం కాగా మూడవ కోరిక ఎప్పటికైనా ఒక సినిమాకి దర్శకత్వం వహించి డైరెక్టర్ గా మారటం. ఎప్పటినుంచో ఆదిత్య 369 సినిమా కి సీక్వెల్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇంకా ప్రాజెక్టు మాత్రం మొదలవలేదు. సింగీతం శ్రీనివాసరావు ఆదిత్య 369 కి దర్శకత్వం వహించారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


తాజాగా భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో కూడా మాట్లాడుతూ తాను ఒక కథ ను కూడా సిద్ధం చేశానని వచ్చే ఏడాది సినిమా మొదలయ్యే అవకాశం ఉందని అన్నారు బాలకృష్ణ. అయితే ఈ సినిమాకి బాలకృష్ణ స్వయంగా దర్శకత్వం వహించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఎప్పటికైనా డైరెక్టర్ గా మారాలన్న తన మూడవ కోరిక కూడా ఈ సినిమాతో తీరబోతోంది అని తెలుస్తోంది. మరి బాలకృష్ణ వచ్చే ఏడాది తన మూడు కోరికలను నెరవేర్చుకుంటారో లేదో వేచి చూడాలి.


Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?


Also Read: TDP-Janasena: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ-జనసేన పోరాటం.. ఉమ్మడి తీర్మానాలు ఇవే..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.