Bhoomika: విడాకులు తీసుకోవాలనుకున్న భూమిక.. కానీ ఆ హీరో ఎంట్రీ తో..!
Bhoomika Divorce: గతంలో భూమిక తన భర్త భరత ఠాకూర్ తో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు బాగా వైరల్ అయ్యాయి. రంగంలోకి దిగిన నాగార్జున నిజమేనా అని అడిగితే, అవి రూమర్స్ అంటూ కొట్టిపారేశారు ఈ జంట. అలా నాగార్జున ఈ జంటపై వచ్చిన రూమర్స్ కి చెక్ పెట్టారు.
Bhoomika and Nagarjuna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు భూమిక స్టార్ హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకొని, టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితో కూడా కలిసి నటించింది. ముఖ్యంగా మహేష్ , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ఈ ముగ్గురు హీరోలతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది భూమిక. మహేష్ బాబుతో ఒక్కడు పవన్ కళ్యాణ్ తో ఖుషి , ఎన్టీఆర్ తో సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి , హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.
అంతేకాదు వెంకటేష్ , నాగార్జున, చిరంజీవి వంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించింది. ఇక తర్వాత కాలంలో యంగ్ హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో భూమిక క్రేజ్ తగ్గిపోతూ వచ్చింది. అయినప్పటికీ అనసూయ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో ఆకట్టుకుంది భూమిక. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఈమె గతంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవ్వగా.. అప్పుడే వాటిపై క్లారిటీ ఇచ్చింది.
ఇండస్ట్రీలో కెరియర్ పీక్ టైం లో ఉండగానే భూమిక యోగా టీచర్ భరత్ ఠాకూర్ ను ప్రేమించి వివాహం చేసుకుంది.వీరికి ఒక బాబు కూడా జన్మించారు. అయితే భూమిక తన భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుందట. భరత్ ఇంకో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే సహించలేక భూమిక తన భర్త నుంచి విడిపోవాలని అనుకుందని కొత్త రూమర్ తెరపైకి వచ్చాయి.
ముఖ్యంగా అప్పట్లో వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యారని , అందుకే కోర్టులో కేసు కూడా వేద్దామని అనుకున్నారట. అయితే ఈ వార్తలు విన్న హీరో నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు. స్నేహమంటే ఇదేరా సినిమాలో భూమిక, నాగార్జున కలిసి నటించారు. ఈ సినిమాలో నాగార్జునతో భూమిక కి మంచి స్నేహబంధం ఏర్పడింది.
అలా భూమిక, భరత్ ఠాకూర్ లు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త నాగార్జున వరకు వెళ్లడంతో, ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా లో ఈ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో నాగార్జున నేరుగా భూమిక ఇంటికి వెళ్లి ఇలా మీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. నిజమేనా..? అని అడిగితే, వారు దీనిపై స్పందిస్తూ..అలాంటిదేమీ లేదు .అవన్నీ రూమర్లు. ఒకవేళ మేము వచ్చే రూమర్లపై స్పందిస్తే అవి నిజమవుతాయి. అందుకే స్పందించలేదు మా ఇద్దరి మధ్య ఇలాంటి విభేదాలు లేవు అంటూ ఆమె తెలిపిందట. అలా నాగార్జున ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు
Also Read: Red King Kobra: ఎరుపు రంగులో నాగుపాము వయ్యారాలు.. చూస్తే మతిపోతది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.