Upcoming Telugu Sequels: టిల్లు స్క్వేర్ ని ఫాలో అవుతున్న చిన్న సినిమాలు.. బోలెడన్ని సినిమాలకు సీక్వెల్స్
Premalu 2: సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యనే మాడ్ స్క్వేర్ ని కూడా సితార ప్రొడక్షన్ సంస్థ వారు ప్రకటించారు. కాగా ఇప్పుడు మరో చిన్న సినిమాకి సైతం సీక్వెల్ సిద్ధమవుతోంది..
Tillu Cube: సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమా సాధించిన విజయం అందరికీ తెలిసిన విషయమే. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం మొదటి భాగం గా వచ్చిన డీజే టిల్లు సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా సీక్వెల్ సైతం ప్రేక్షకులను ఎంతగానో అలరించి మొదటి భాగం కన్నా ఎక్కువ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
టైర్ 2 హీరోల్లో ఈ చిత్రంతో సిద్దు జొన్నలగడ్డ మొదటి ప్లేస్ సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాకి నిర్మాణ బాధ్యతలు వహించిన సితార ఎంటర్టైన్మెంట్స్ తమ మరో సూపర్ హిట్ సినిమా మ్యాడ్ సినిమాకి కూడా ఈ మధ్యనే సీక్వెల్ ప్రకటించారు. మ్యాడ్ స్క్వేర్ గా ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో చిన్న చిత్రానికి కూడా సీక్వెల్ మొదలుకానుంది.
ఈమధ్య తెలుగులో మలయాళీ సినిమాల ప్రభంజనం ఎక్కువగా ఉంది. మలయాళం లో మంచి విజయాలు సాధించిన చిత్రాలు తెలుగులో సైతం సూపర్ హిట్లుగా నిలిచాయి. మలయాళం నుంచి మంజులం బాయ్స్, ప్రేమలు వంటి సినిమాలు తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు భారీ ప్రాఫిట్స్ ని తెచ్చిపెట్టాయి. దీంతో ఈ క్రేజ్ ని కాష్ చేసుకోవడం కోసం తెలుగు, మలయాళీ సినిమా నిర్మాతలు ఈ సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ ని తీసుకు వచ్చేస్తున్నారు.
టిల్లు స్క్వేర్ సినిమాకి ‘టిల్లు క్యూబ్’ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోపక్క మ్యాడ్ స్క్వేర్ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది. వీటన్నిటి మధ్య ఇప్పుడు ప్రేమలు సీక్వెల్ కూడా ప్రకటించేశారు చిత్ర యూనిట్. 2025లో ప్రేమలు 2 రాబోతుంది అంటూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అనౌన్స్ చేసారు చిత్ర యూనిట్. ఇక మరోపక్క హనుమాన్ కి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సీక్వెల్స్ అన్నీ కూడా మొదటి లాగా మంచి విజయాలు సాధిస్తాయి ఏమో వేచి చూడాలి.
Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook