Tillu Square OTT News: టీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' మూవీ పూటకో రికార్డును బ్రేక్ చేస్తోంది. నిన్నటితో ఈ సినిమా మొదటి వారం పూర్తి చేసుకుంది.
మొదటి రోజు రికార్డు బ్రేక్ వసూళ్లతో మొదలైన ఈ సినిమా ప్రయాణం.. రోజుకో రికార్డులను మటు మాయం చేస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సినిమా ఈ నెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానునట్టు సమాచారం. ఈ సినిమా ఓటీటీ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 15 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ మాత్రం దాదాపు రూ. 5 కోట్లకు సోల్డ్ అయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా శాటిలైట్ హక్కులు ప్రముఖ టీవీ కొనుగోలు చేసింది. సిద్దు జొన్నలగడ్డ  విషయానికొస్తే.. ఒక్కో హీరోకు ఒక్కో మూవీ లైఫ్ ఇస్తూ ఉంటుంది. అలా సిద్దు జొన్నలగడ్డకు 'డీజే టిల్లు' మూవీ మంచి గుర్తింపుతో పాటు ఓవర్ నైట్ స్టార్‌ను చేసింది. టిల్లు బ్రాండ్‌తో ఈ సినిమా మూడు రోజుల్లోనే అన్ని రికార్డులను మడతేట్టేసింది. డీజే టిల్లు చూసిన వాళ్లకు 'టిల్లు స్క్వేర్'కు ఈజీగా కనెక్ట్ అవుతారు. ఈ సీజన్‌లో ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ మూవీలో ఉండటం టిల్లు స్క్వేర్‌కు బాగా కలిసొచ్చాయి.  
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తంగా ఈ సినిమా నిన్నటితో మొదటి వారం పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీక్‌లోనే దాదాపు రూ. 20 కోట్లకు పైగా లాభాలతో ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రెండో వారంలో ఈ సినిమాకు విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్‌'తో గట్టి పోటీ ఉంది. మరి ఈ పోటీలో టిల్లు స్క్వేర్ ఎలాంటి వసూళ్లను రాబడుతుందనేది చూడాలి. ఈ సినిమా మొదటి వారం వసూళ్ల విషయానికొస్తే..


ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల వసూళ్ల విషయానికొస్తే..
తొలి రోజు..  రూ. 14.30 కోట్ల షేర్ (రూ. 23.70 కోట్ల గ్రాస్)
రెండో రోజు.. రూ. 10.81 కోట్ల షేర్ (రూ. 18.90 కోట్ల గ్రాస్)
మూడో రోజు.. రూ. 12.01 కోట్ల షేర్ (రూ. 21.01 కోట్ల గ్రాస్)
4వ రోజు.. రూ. 5.46 కోట్ల షేర్ (రూ. 10.28 కోట్ల గ్రాస్)
5వ రోజు.. రూ. 3.70 కోట్ల షేర్ (రూ. 6.25 కోట్ల గ్రాస్)
6వ రోజు.. రూ. 2.60 కోట్ల షేర్ (రూ. 4.80 కోట్ల గ్రాస్)
7వ రోజు.. రూ. 2.10 కోట్ల షేర్ (రూ. 3.90 కోట్ల గ్రాస్)
వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా వారం రోజుల్లో 48.71 కోట్ల షేర్ (రూ. 84.95 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.


'టిల్లు స్క్వేర్' ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..  
తెలంగాణ  (నైజాం).. రూ. 8 కోట్లు..
రాయలసీమ( సీడెడ్).. రూ. 3 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్.. రూ. 11 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ కలిపి రూ. 22 కోట్లు


కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్.. రూ. 2 కోట్లు
ఓవర్సీస్ .. రూ. 3 కోట్లు..
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. ఓవరాల్‌గా ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రూ.21 కోట్ల లాభాలతో  బ్లాక్‌బస్టర్‌గా  నిలిచింది. అంతేకాదు హనుమాన్ తర్వాత ఆ రేంజ్ హిట్ 'టిల్లు స్క్వేర్' మూవీకే దక్కింది. ఈ సినిమా జోరు చూస్తుంటే.. ఈ సినిమా ముందు ముందు బాక్సాఫీస్ దగ్గర ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.


Also Read: Kavitha Bail: ఎమ్మెల్సీ కవితపై ఈడీ సంచలన వ్యాఖ్యలు.. ఇక జైలు బయటకు రానట్టే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook