Tillu Square OTT Streaming Date: గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సహా ఇతర ఇండస్ట్రీస్‌లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఈ రూట్లోనే డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్వ్కేర్' మూవీ  బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా థియేట్రికల్‌గా రన్ అవుతున్న ఈ సినిమా ఈ రోజు అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ భాషల్లో 'టిల్లు స్క్వేర్' స్ట్రీమింగ్ అవుఓతంది.  మొత్తంగా  'డీజే టిల్లు' అనే బ్రాండ్‌తో  టిల్లు స్వ్కేర్ మూవీ మీడియం రేంజ్ మూవీల్లో ఎవరు టచ్ చేయని  బెంచ్ మార్క్ అందుకొని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.  డీజే టిల్లు మూవీతో ఓవర్ నైట్ స్టార్ బాయ్‌గా మారాడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌. అంతేకాదు టిల్లు బ్రాండ్‌తో 'టిల్లు స్వ్కేర్' మూవీకి  మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అంతేకాదు ఈ సినిమా  తొలిరోజే దాదాపు రూ. 25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఔరా అనిపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టిల్లు స్క్వేర్ మూవీ ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 70 కోట్ల షేర్ ( రూ. 125 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.  సిద్దు జొన్నలగడ్డ విషయానికొస్తే..  దశాబ్దం క్రితం  నాగ చైతన్య కథానాయికుడిగా నటించిన 'జోష్‌' మూవీలో చిన్న క్యారెక్టర్‌తో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి చిన్నా చితకా పాత్రలతో సినీ ఇండస్ట్రీలో నెగ్గుకొస్తున్నాడు.   మొత్తంగా ఎన్నో ఒడిదుడుకుల తర్వాత సిద్దుకు డీజే టిల్లు మూవీతో పెద్ద బ్రేక్ వచ్చింది.  తాజాగా టిల్లు స్క్వేర్ మూవీతో మరోసారి తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.  



టిల్లు స్క్వేర్ విషయానికొస్తే.. ఫస్ట్ పార్ట్ చూసినవారు రెండో పార్ట్‌కు ఇట్టే కనెక్ట్ అవుతారు.  తాజాగా ఈ సినిమాకు టిల్లు క్యూబ్ మూవీ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాను మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్టైన్మెంట్ భారీ ఎత్తున నిర్మించింది. ఈ సినిమా రూ. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగి దాదాపు రూ. 40 కోట్ల థియేట్రికల్‌గా లాభాలను తీసుకొచ్చింది. మరోవైపు డిజిటల్, శాటిలైట్ హక్కుల రూపేణా మరో రూ. 25 కోట్ల వరకు లాభాను ఆర్జించింది.


Also Read: YS Jagan Assets: దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్‌.. ఆయన ఆస్తిపాస్తుల లెక్కలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter