Rana Daggubati At City Civil Court: టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ గా పేరు పొందిన దగ్గుబాటి రానా మంగళవారం నాడు హైదరాబాద్ సివిల్ సిటీ కోర్టుకు హాజరైన వ్యవహారం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన హాజరైన కేసు విషయానికి వస్తే ఒకప్పటి నటి మాధవి లతకు ఫిలింనగర్ లో 2200 చదరపు గజాల స్థలం ఉండేది. అయితే ఆ స్థలాన్ని హీరో దగ్గుబాటి వెంకటేష్ ఆయన సోదరుడు అంటే దగ్గుబాటి రానా తండ్రి సురేష్ కలిసి కొనుగోలు చేశారని చెబుతున్నారు. అయితే అది అక్రమ కొనుగోలు అనే ఆరోపణలు ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ సంగతి పక్కన పెడితే వీరిరువురు 2014వ సంవత్సరంలో ఆ స్థలాన్ని ఒక వ్యాపారికి లీజు నిమిత్తం అగ్రిమెంట్ చేశారు. 2014వ సంవత్సరంలో జరిగిన ప్లీజ్ అగ్రిమెంట్ తర్వాత 2016 లో, 2018 లో కూడా లీజు అగ్రిమెంట్ రెన్యువల్ చేశారు. ఆ లెక్కన లీజు అగ్రిమెంట్ కొనసాగుతూ ఉన్న సమయంలోనే ఆ 2200 చదరపు గజాల స్థలంలో 1000 గజాల స్థలాన్ని సురేష్ తన కుమారుడు రానా పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.. రానా రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే అందులో ఉన్న లీజు దారుడిని ఆ స్థలం ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారు.


ఆ ఒత్తిడి తట్టుకోలేక అతను స్థలం ఖాళీ చేశాడు. అయితే ప్లీజ్ అగ్రిమెంట్ ఉండగానే తన స్థలం ఖాళీ చేయమని కోరడం కరెక్ట్ కాదని, దాని వల్ల తాను ఆర్ధికంగా నష్టపోయానని చెబుతూ బాధితుడు సిటీ సివిల్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపద్యంలోనే రానాకు కోర్టు నోటీసులు అందడంతో ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఇక రానా సినిమాల విషయానికి వస్తే ఆయన హీరోగా నటిస్తూనే మరోపక్క తన తండ్రికి చెందిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనేక సినిమాలను కొని విడుదల చేస్తున్నారు.


అయితే ఎక్కువగా ఆయన రిలీజ్ చేస్తున్న సినిమాలు నష్టాలే తీసుకు వస్తున్నాయని చెప్పాలి. ఇక ఇటీవల రానా హీరోగా నటించిన విరాటపర్వం సినిమా కూడా విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కానీ నెట్ఫ్లిక్స్ లో మాత్రం సినిమాకు మంచి స్పందన లభించింది. ఇక రానా వెంకటేష్ కలిసి రానా -నాయుడు అనే ఒక వెబ్ సిరీస్ లో నటించారు. ఆ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో విడుదల కావాల్సి ఉంది.


Also Read: Gangavva: గంగవ్వా మజాకా.. ఆమె కోసం స్పెషల్ క్యారవాన్.. ఆ రెంజే వేరబ్బా!


Also Read: Pooja Hegde: బికినీ ట్రీట్ ఇచ్చిన బుట్టబొమ్మ.. సముద్రం ఒడ్డున సొగసరి పూజా హొయలు!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook