ప్రముఖ నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో ( Kosuri Venugopal died of COVID-19) మృతి చెందారు. కరోనావైరస్ సోకిన వేణుగోపాల్ గత 22 రోజులుగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కొవిడ్-19 చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వేణుగోపాల్ స్వస్థలం. కోసూరి వేణుగోపాల్ తనదైన స్టైల్లో ఓ డైలాగ్ డిక్షన్‌ ఏర్పర్చుకుని తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. Also read : Union minister Suresh Angadi death: కరోనాతో కన్నుమూసిన కేంద్ర మంత్రి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1994లో వచ్చిన తెగింపు అనే చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమైన వేణుగోపాల్.. మర్యాదరామన్న, ఛలో, విక్రమార్కుడు, పిల్ల జమీందార్ వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 


వృత్తిరీత్యా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ( FCI ) మేనేజర్ అయిన కోసూరి వేణుగోపాల్‌కి నటన అంటే ఎంతో మక్కువ. ఆ ఇష్టంతోనే ఉద్యోగం చేసే రోజుల్లో నుంచే సినిమాల్లో నటిస్తున్నారు. ఉద్యోగం నుండి పదవీవిరమణ పొందిన అనంతరం ఆయన సినిమాలపైనే ఎక్కువ దృష్టిసారించారు. Also read : Samantha about Naga Chaitanya: చైతూ పర్మిషన్ లేకుండా ఆ పనే చేయను


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe