Nagarjuna: టాలీవుడ్ మేటి నటుడు కింగ్ నాగార్జున ఒక్కసారిగా బిజీ అయిపోయాడు. ఏకంగా నాలుగు సినిమాలతో షెడ్యూల్ టైట్‌గానే హ్యాండిల్ చేస్తున్నాడు. నాగార్జున ఇంత బిజీగా ఉండటం ఇదే తొలిసారి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు సినీ పరిశ్రమ ( Tollywood )లో అగ్రనటుడిగా, సినీ తెర మన్మధుడిగా పేరు పొందిన నాగార్జున వయసు పైబడుతున్నా ఇంకా ఎవర్ గ్రీన్ అంటున్నాడు. వయసు ఛాయలు ఏ మాత్రం కన్పించని హీరోల్లో నాగార్జున ఒకడు. చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత బిజీ షెడ్యూల్ హ్యాండిల్ చేస్తున్నాడు. గత రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నాగార్జున ఈ మధ్యనే వైల్డ్ డాగ్ సినిమా చేశాడు. షూటింగ్ పూర్తయింది కానీ ఇంకా విడుదల కాలేదు. నెట్‌ఫ్లిక్స్‌ ( Netflix )లో విడుదల చేయాలని ఒప్పందం చేసుకున్నా..ఇప్పుడు మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడీ సినిమా రిలీజ్ పనుల్లో ఉన్నాడు.


మరోవైపు ఇంకో మూడు సినిమాల్ని హ్యాండిల్ చేస్తున్నాడు. మన్మధుడు 2 ఫ్లాప్ అవడంతో చాలా కాలం తరువాత వైల్డ్‌డాగ్ సినిమా ( Wild dog movie )కు ఒప్పుకున్నాడు. మిగిలిన మూడు సినిమాల్లో ఒకటి బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్ర ( Brahmasthra ). అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ( Amitabh bachchan ), రణ్‌బీర్ కపూర్, అలియా భట్ నటిస్తున్నారు. ఇందులో కీలకపాత్రలో నాగార్జున ( Nagarjuna ) కన్పించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి నాగార్జున పార్ట్ పూర్తయిపోయింది. ఇక మరో సినిమా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించాడు. సికింద్రాబాద్‌లోని శ్రీ గణపతి దేవాలయంలో ఈ చిత్రం ప్రారంభమైంది. అత్యంత శక్తివంతమైన దేవాలయమని..ఇదే తొలిసారి రావడమని నాగార్జున చెప్పుకొచ్చాడు.


ప్రవీణ్ సత్తార్ సినిమా టైటిల్ మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో కధ ఉంటుందని తెలుస్తోంది. షూటింగ్‌ను లండన్, ఊటీ, గోవా, హైదరాబాద్‌లలో ప్లాన్ చేసినట్టు సమాచారం. మరోవైపు కళ్యాణ్ కృష్ణ, కురసాల దర్శకత్వంలో వస్తున్న బంగార్రాజు సైతం లైన్‌లో ఉంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. మొత్తానికి నాలుగు సినిమాలతో హెక్టిక్ షెడ్యూల్‌లో ఉన్నాడు కింగ్ నాగార్జున.


Also read: Kapatadhaari​​ Theme Trailer: ఆసక్తిరేకెత్తిస్తున్న కపటధారి థీమ్ ట్రైలర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook