Anupama Parameswaran Went Pawan Kalyan's Bheemla Nayak movie in a Burqa: అనుపమ పరమేశ్వరన్‌.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ మలయాళీ ముద్దుగుమ్మ 'ప్రేమమ్‌' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అఆ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, తేజ్, కృష్ణార్జున యుద్ధం, రాక్షసుడు వంటి సినిమాల్లో నటించారు. ఎప్పుడూ పద్దతిగా ఉండే అనుపమ.. ఈ ఏడాది ఆరంభంలో దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాలో రెచ్చిపోయారు. లిప్ లాక్ సీన్‌లలో నటించి అందరిని ఆశ్చర్యపరిచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనుపమ పరమేశ్వరన్‌ ఓవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు. అనుపమ తాజాగా నటించిన చిత్రం 'బటర్‌ఫ్లై'. గంటా సత్తిబాబు తెరకెక్కించిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే అనుపమ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. బటర్‌ఫ్లై సినిమా కథ తనకెంతో నచ్చిందని, ప్రతిఒక్కరిని మెప్పించే వైవిధ్యమైన కథతో ఈ చిత్రం రూపుదిద్దుకొందని తెలిపారు. మలయాళంలో తాను నటించిన తొలి సినిమా విడుదలయ్యాక ఎంతోమంది నుంచి ట్రోల్స్‌ వచ్చాయని వచ్చాయన్నారు. అభిమానుల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని అనుపమ చెప్పుకొచ్చారు.


ఇంటర్వ్యూలో భాగంగా పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌పై మీ అభిప్రాయం ఏమిటి? ఆయనతో సినిమా  ఎప్పుడు చేస్తారు? అని విలేకరి అడగ్గా... 'పవన్‌ కల్యాణ్‌ గురించి అభిప్రాయం చెప్పే స్థాయికి నేను ఇంకా రాలేదు. ఆయన స్టార్‌ హీరో. పవన్ సర్ అంటే నాకెంతో ఇష్టం. ఆయన సినిమాలు చూస్తుంటాను. ఇటీవల విడుదలైన భీమ్లా నాయక్‌ కూడా చూశా. బటర్‌ఫ్లై హీరో నిహాల్‌తో కలిసి మొదటి రోజు ఫస్ట్‌ షో హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో చూశా. థియేటర్‌కు వచ్చిన వాళ్లెవరూ నన్ను గుర్తుపట్టకుండా.. బురఖా వేసుకుని థియేటర్‌కు వెళ్లి సినిమా చూశాను' అని అనుపమ తెలిపారు.


Also Read: Chiranjeevi-kamal Haasan: చిరంజీవి ఇంట్లో క‌మ‌ల్ హాస‌న్.. పార్టీలో సల్మాన్‌ ఖాన్‌ సందడి!


Also Read: SL vs AUS: టీ20ల్లో చరిత్ర సృష్టించిన శ్రీలంక ప్లేయర్.. తొలి జట్టుగా లంక అరుదైన రికార్డు!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.