SL vs AUS: టీ20ల్లో చరిత్ర సృష్టించిన శ్రీలంక ప్లేయర్.. తొలి జట్టుగా లంక అరుదైన రికార్డు!

Sri Lanka vs Australia 3rd T20I: శ్రీలంక ఆల్ రౌండర్ దసున్ షనక టీ20 ఛేజింగ్‌లో డెత్ ఓవర్లలో 50కి పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 12, 2022, 02:08 PM IST
  • టీ20ల్లో చరిత్ర సృష్టించిన శ్రీలంక ప్లేయర్
  • తొలి జట్టుగా లంక అరుదైన రికార్డు
  • 3 ఓవర్లలో 22, 18, 19 పరుగులు
SL vs AUS: టీ20ల్లో చరిత్ర సృష్టించిన శ్రీలంక ప్లేయర్.. తొలి జట్టుగా లంక అరుదైన రికార్డు!

Dasun Shanaka becomes first ever player to score 50 plus runs in death overs of T20I chase: మూడు టీ20 సిరీస్‌లో భాగంగా పల్లెకెలె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన మూడో టీ20లో శ్రీలంక ఊహించని విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక​ మరో బంతి ఉండగానే విజయాన్ని అందుకుంది. శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ షనక (54 నాటౌట్‌; 25 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో లంకకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. పాతుమ్ నిస్సంక (27), చరిత్ అసలంక (26) పర్వాలేదనిపించారు. ఈ గెలుపుతో లంక క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకుంది. 

ఈ విజయంతో అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో చివరి మూడు ఓవర్లో అత్యధిక పరుగులు ఛేజ్‌ చేసిన తొలి జట్టుగా శ్రీలంక నిలిచింది. 17 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 118/6. విజయానికి చివరి 3 ఓవర్లలో 59 పరుగులు కావాలి. ఈ సమయంలో దసున్‌ షనక మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. వరుసగా 3 ఓవర్లలో 22, 18, 19 పరుగులు బాదాడు. దాంతో చివరి మూడు ఓవర్లో అత్యధిక పరుగులు ఛేజ్‌ చేసిన జట్టుగా లంక రికార్డుల్లో నిలిచింది. 

మరోవైపు శ్రీలంక ఆల్ రౌండర్ దసున్ షనక టీ20 ఛేజింగ్‌లో డెత్ ఓవర్లలో 50కి పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. షనక 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో ఇప్పటివరకు డెత్ ఓవర్లలో ఎవరూ కూడా హాఫ్ సెంచరీ బాగాలేదు. 98 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన లంక జట్టును షనక ఆదుకున్నాడు. కేన్ రిచర్డ్‌సన్ వేసిన చివరి ఓవర్‌లో శ్రీలంకకు 19 పరుగులు అవసరం కాగా.. షనక రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదాడు. రిచర్డ్‌సన్‌ వైడ్‌ డెలివరీ వేయడంతో శ్రీలంక విజయం సాధించింది. 

ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచుల టీ20 సిరీస్ జరగ్గగా.. ఆసీస్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదటి రెండు మ్యాచులు ఆసీస్ గెలవగా.. చివరి మ్యాచ్ లంక గెలిచింది. ఇక ఇరు జర్ల మధ్య జూన్ 14 నుంచి 24 మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరగనుంది. మొదటి రెండు మ్యాచులు పల్లెకెలెలో మిగిలిన మూడు కొలంబోలో జరుగుతాయి. 

Also Read: KTR COMMENTS: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయం! ఖమ్మం నేతలకు కేటీఆర్ సంకేతం..

Also Read: TS TET 2022: నిమిషం లేటైనా నో ఎంట్రీ.. బతిమాలినా కనికరించని పోలీసులు! సెంటర్ల దగ్గర అభ్యర్థుల కన్నీళ్లు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News