బిగ్‌బాస్ 3 ఫేమ్, టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam) తన అభిమానులకు షాకిచ్చారు. బిగ్‌బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి పెళ్లి వదంతులు వైరల్ అయ్యేవి. కానీ తాజాగా సీన్ రివర్స్ అయింది. బిగ్‌బాస్ భామ పునర్నవి (Punarnavi Bhupalam Engagement Ring) తన చేతి వేలికి ఉంగరాన్ని చూపిస్తూ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో కలకలం రేపింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పున్నూ ఎన్నో పోస్టులు చేసింది, కానీ ఈ ఫొటో రేపిన కలవరం అంత ఇంతా కాదు. దీంతో టాలీవుడ్ నటి పునర్నవి భూపాలం సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ (Punarnavi Bhupalam Engagement) చేసుకున్నారని, నిశ్చితార్థపు ఉంగరం ఫొటో చూపించారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఎట్టకేలకు ఇది జరుగుతోంది అంటూ పునర్నవి ఓ పోస్ట్ చేసింది. ఆమె చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని గమనిస్తే నిజంగానే నిశ్చితార్థం జరిగి ఉంటుందని, లేకపోతే ఆమె ప్రత్యేకంగా ఇది షేర్ చేయరని తెలుస్తోంది. పునర్నవి భూపాలం ఎంగేజ్‌మెంట్ జరిగిందని కొందరు అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరికొందరు మాత్రం నిజంగా ఎంగేజ్‌మెంట్ జరిగిందా.. లేక సినిమా ప్రమోషనా అని హాట్ టాపిక్ అవుతోంది.



 


పునర్నవి షేర్ చేసిన ఫొటో చూసి ఆమె స్నేహితురాలు షాకైంది. ఏంటి .. ఇది నిజమేనా.. నీ సీక్రెట్ వివరాలు మరికాస్త చెప్పవా మరి అని నటిని అడిగింది. అక్టోబర్ 30 వరకు వేచి చూడక తప్పదని చెబుతోంది పునర్నవి. సినిమాల్లో నటించినా రాని క్రేజ్.. రియాలిటి షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3తో పునర్నవి సొంతం చేసుకుంది. ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో రిలేషన్ కొనసాగించడం ఆ సీజన్‌లో, ఆ తర్వాత కూడా కొంతకాలం సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఇంతకీ పున్నూ ఏం చెబుతుందో మరి.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe