Jr Ntr new movie: హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో బంపర్ హిట్ మూవీ జనతా గ్యారేజ్ తరువాత మరో మూవీ రాలేదు. త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో మూవీ త్వరలో తెరకెక్కబోతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie)..జూనియర్ ఎన్టీఆర్‌కు మోస్ట్ ఎవైటెడ్ మూవీ. ఈ సినిమా తరువాత మరోసారి జనతా గ్యారేజ్(Janata Garrage)సినిమా కాంబినేషన్ రిపీట్ కానుందని తెలుస్తోంది. 2016లో విడుదలై భారీ హిట్ సాధించిన ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించారు. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. 2018లో త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ తరువాత మరో కాంబినేషన్ సినిమా ప్రకటన వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి. తరువాత ఎందుకో తాత్కాలికంగా బ్రేక్ పడింది. సరిగ్గా అదే సమయంలో ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్( Junior Ntr) ‌తో సినిమా చేస్తున్నారనే ప్రచారం సాగిది. స్పోర్ట్స్ డ్రామా నేపధ్యంగా సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కొరటాల శివ(Koratala Siva)తో జూనియర్ ఎన్టీఆర్ మరో సినిమా వస్తుందనేది దాదాపు ఖరారైంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుంది. 


కొరటాల శివ..జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా తీస్తుంటే..అల్లు అర్జున్-కొరటాల శివ సినిమా పరిస్థితి ఏంటనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. నిలిచిపోయిన త్రివిక్రమ్(Trivikram)-జూనియర్ ఎన్టీఆర్ సినిమా స్థానంలో త్రివిక్రమ్-మహేశ్ బాబు సినిమా తెరకెక్కబోతోంది. ఆచార్య సినిమా(Acharya movie)లో బిజీగా ఉన్న కొరటాల శివ..త్వరలో సినిమా పనులు ప్రారంభించనున్నారు.


Also read: Khiladi Teaser: మాస్ మహారాజ్ రవితేజ ‘ఖిలాడీ’ టీజర్ విడుదల, డ్యూయల్ రోల్ పోషించాడా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook