Tollywood Domination in Pan Indian Race: ఇప్పుడు దాదాపు మన హీరోలు చేస్తున్న అన్ని సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.  అయితే ఇండియాలో ఉన్న టాప్ టెన్ పాన్ ఇండియా హీరోలు ఎవరు అని అడిగితే అందరూ తడుముకోకుండా ప్రభాస్ పేరునే ప్రస్తావిస్తారు. కానీ పాన్ ఇండియా లెవెల్ లో మొదటి స్థానాన్ని ప్రతి నెల తమిళ హీరో విజయ్ దక్కించుకోవడం ఆసక్తికరంగా మారుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓఆర్ మ్యాక్స్ మీడియా అనే ఒక మీడియా సంస్థ నిర్వహిస్తున్న సర్వేల ప్రకారం మార్చి నెలలో విజయ్ మోస్ట్ పాపులర్ మెయిల్ స్టార్స్ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ రెండవ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక ఇండియాలోనే మొట్టమొదటి పాన్ ఇండియా హీరోగా లాంచ్ అయిన ప్రభాస్ ఈ జాబితాలో మూడో స్థానం దక్కించుకున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ స్టార్ క్రేజ్ అందుకున్న ఎన్టీఆర్ ఈ జాబితాలో నాలుగవ స్థానం దక్కించుకున్నాడు. ఇక తమిళంలో విజయ్ తో పోటాపోటీగా సినిమాలు చేస్తూ ఉండే అజిత్ కుమార్ మాత్రం ఐదో స్థానానికి పరిమితమయ్యాడు.


Also Read: Shaakuntalam Vs Virupaksha: సమంత 'శాకుంతలం'కి దెబ్బ మీద దెబ్బ.. ఒక్కరోజులోనే విరూపాక్ష బ్రేక్ చేసేసిందిగా!


ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో మెరిసిన రామ్ చరణ్ తేజ ఆరవ స్థానం దక్కించుకుంటే పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా లాంచ్ అయి అందరికీ ఒక్కసారిగా పరిచయమైన అల్లు అర్జున్ ఏడవ స్థానం దక్కించుకున్నాడు. ఇక ఈ జాబితాలో ఎనిమిదవ స్థానాన్ని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దక్కించుకోగా తొమ్మిదవ స్థానాన్ని మాత్రం సల్మాన్ ఖాన్ దక్కించుకున్నాడు. ఇక ఈ పాన్ ఇండియా మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్స్ జాబితాలో కన్నడ సినీ పరిశ్రమ నుంచి కేవలం యష్ ఒక్కరే స్థానం దక్కించుకోగలిగారు.


ఆయన కేజిఎఫ్ సిరీస్ సినిమాలతో కేవలం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల ప్రేక్షకులను మాత్రమే కాదు పాన్ ఇండియా రేంజ్ లో హిందీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొద్ది నెలల క్రితం వరకు ఈ జాబితాలో ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయని మహేష్ బాబు కూడా స్థానం దక్కించుకునే వాడు. కానీ ఇప్పుడు ఎందుకు ఆయన పేరు ఈ లిస్టులో కనిపించడం లేదో క్లారిటీ లేదు.  మొత్తం మీద టాప్ టెన్ హీరోల లిస్ట్ తీస్తే తెలుగు హీరోలు నలుగురు ఉండడం గమనార్హం. ఇక తమిళ హీరోలు ఇద్దరు, బాలీవుడ్ హీరోలు. ముగ్గురు కన్నడ హీరో ఒకరు ఉండడం చూస్తే మొత్తం మీద పాన్ ఇండియా హీరోల లిస్టులో టాలీవుడ్ డామినేషన్ గట్టిగా కనిపిస్తోందని చెప్పక తప్పదు.


Also Read: Virupaksha Collections: 'విరూపాక్ష'కి ఊహించని షాక్.. సూపర్ హిట్ టాక్ తో కూడా డిజాస్టర్ సినిమా కలెక్షన్స్ దాటలేక పోయిందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook