Hyderabad: టాలీవుడ్ సినిమా నటుడు A.కృష్ణం అలియాస్ హీరో కృష్ణుడుని (Tollywood hero krishnudu ) పోలీసులు అరెస్ట్ చేసారు. గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మియాపూర్ పోలీసులు (Miyapur Police) పక్క ప్లాన్ వేసి.. పేకాట ఆడే వారిని పట్టుకున్నారు. హీరో హీరో కృష్ణుడు తో సహా మరో ఎనిమిది కూడా అరెస్ట్ చేసారు. మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిల్పాపార్క్ విల్లాలో (Shilpa Park Villa) పేకాట (Poker) ఆడుతున్నట్లు గుర్తించిన పోలీసులు నటుడు కృష్ణుడుని అదుపులోకి తీసుకున్నారు. నటుడు కృష్ణుడుతో పాటు ప్రధాన నిర్వాహకుడు పెద్ది రాజును (Peddi Raju) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Shani Trayodashi 2021: ఈ రోజు "శని త్రయోదశి".. శనిదోష నివారణకు ఇలా చేయండి!


"వినాయకుడు"తో (Vinayakudu Movie) మంచి విజయం అందుకున్న హీరో కృష్ణుడు... విలేజ్‌లో వినాయకుడు (Village lo vinayakudu), ఆర్య2 (Arya-2), జ్యోతి లక్ష్మి (Jyothy Laxmi), హ్యాపీడేస్ (Happy days), యువత (Yuvatha), షాక్, స్నేహగీతం, తదితర సినిమాల్లో నటించాడు. టాలీవుడ్ లో తనదైన కామెడీతో గుర్తింపు తెచ్చుకున్న హీరో కృష్ణుడు ప్రస్తుతం వైసీపీ పార్టీలో (YSRCP Party) కొనసాగుతున్నాడు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook