Rowdy Boys Trailer: ఎక్కడైనా రాసుందా.. పెద్దమ్మాయిలను ప్రేమించొద్దని! రౌడీ బాయ్స్ ట్రైలర్ అదుర్స్ (వీడియో)!!
`రౌడీ బాయ్స్ సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించారు. హీరో ఆశిష్, స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన తాజా సినిమా రౌడీ బాయ్స్.
NTR launch Rowdy Boys trailer: టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ (Ashish), స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా తెరకెక్కిన తాజా సినిమా 'రౌడీ బాయ్స్' (Rowdy Boys). ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాత నిర్మాత దిల్ రాజు (Dil Raju), శిరీష్ (Shirish) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రౌడీ బాయ్స్ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. హీరో అశిష్.. శిరీష్ సొంత కుమారుడు. అందుకే ఈ సినిమాను నిర్మాతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రమోషన్స్ కూడా దిల్ రాజు, శిరీష్ అదే రేంజ్‌లో చేస్తున్నారు.
తాజాగా 'రౌడీ బాయ్స్ సినిమా ట్రైలర్ ( Rowdy Boys Trailer)ను టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఆవిష్కరించారు. ట్రైలర్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న ఎన్టీఆర్.. ట్రైలర్ చూస్తుంటే హిట్ ఖాయమనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న ఆశిష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్.. దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మరియు చిత్రబృందానికి ఎన్టీఆర్ గుడ్ లక్ చెప్పారు.
Also Read: Rashmika Remuneration: పుష్ప సక్సెస్.. భారీగా పెంచేసిన రష్మిక మందన్న! వామ్మో మరీ అంతనా?!!
మా డాడ్ ఏంట్రా పొద్దుపొద్దున్నే నిద్రలేపి కాలేజ్, కాలేజ్ అంటాడు అనే డైలాగ్‌తో రౌడీ బాయ్స్ సినిమా ట్రైలర్ ఓపెన్ అయింది. 'ఏందిరా ఇది.. రోజురోజుకు ఇంతింత విచిత్రంగా తయారౌవున్నావేంట్రా', 'ఎక్కడైనా రాసుందా.. పెద్దమ్మాయిలను ప్రేమించొద్దని', 'అన్నా మెడికల్ కాలేజ్ అమ్మాయిని డేట్‌కి తీసుకురావచ్చా', 'మా కాలేజ్ అమ్మాయిల జోలికి రాకండి' అనే డైలాగ్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. కాలేజి నేపథ్యంలో యూత్ ఫుల్ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి