MS Dhoni - Haris Rauf: ఎంఎస్ ధోనీ స్పెషల్‌ గిఫ్ట్‌.. భావోద్వేగానికి గురైన పాకిస్తాన్ క్రికెటర్‌! మహీ మాటిస్తే అంతేమరి!!

తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. తాను సంతకం చేసిన సీఎస్కే జెర్సీని పాకిస్తాన్‌ పేసర్‌ హారిస్‌ రవూఫ్‌కు పంపించాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 06:32 PM IST
  • ఎంఎస్ ధోనీ స్పెషల్‌ గిఫ్ట్‌
  • భావోద్వేగానికి గురైన పాకిస్తాన్ క్రికెటర్‌
  • పాక్ పేసర్‌కు ధోనీ గిఫ్ట్‌
MS Dhoni - Haris Rauf: ఎంఎస్ ధోనీ స్పెషల్‌ గిఫ్ట్‌.. భావోద్వేగానికి గురైన పాకిస్తాన్ క్రికెటర్‌! మహీ మాటిస్తే అంతేమరి!!

MS Dhoni Sends signed CSK Jersey to Pakistan Pacer Haris Rauf: టీమిండియా (Team India) కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ (MS Dhoni) గొప్పదనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి బ్యాటర్‌గా, గొప్ప సారథిగా, బెస్ట్ వికెట్‌ కీపర్‌గా, అత్యుత్తమ ఫినిషర్‌గా మహీ క్రికెట్‌ చరిత్రలో చెరగని ముద్ర వేశాడు. కేవలం ఆటతోనే కాకుండా సహచర క్రికెటర్లు, ఇతర జట్ల ఆటగాళ్లతో వ్యవహరించే తీరు కూడా ధోనీని ఇంకో మెట్టు ఎక్కించింది. మొత్తంగా మహీ కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు. తాజాగా మరోసారి ధోనీ తన గొప్ప మనసును చాటుకున్నాడు. పాకిస్తాన్‌ పేసర్‌ (Pakistan Pacer) హారిస్‌ రవూఫ్‌కు ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ పంపించి అతడిని ఆశ్చర్యానికి గురిచేశాడు. 

తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. తాను సంతకం చేసిన సీఎస్కే జెర్సీని పాకిస్తాన్‌ పేసర్‌ హారిస్‌ రవూఫ్‌ (Haris Rauf)కు పంపించాడు. ఈ విషయాన్ని రవూఫ్‌ శుక్రవారం సోషల్‌ మీడియా వేదికగా తెలిపాడు. 'క్రికెట్ దిగ్గజం, కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనీ ఈ అందమైన బహుమతిని నాకు పంపించాడు. తన జెర్సీ ఇది. తన మంచి మనసుతో నెంబర్‌ 7 (CSK Jersey) ఇంకా హృదయాలను కొల్లగొడుతూనే ఉన్నాడు. థాంక్స్ మహీ భాయ్' అని రవూఫ్‌ పేర్కొన్నాడు. అలానే తనకు ఈ గిఫ్ట్‌ అందడంలో సహకరించిన సీఎస్కే జట్టు మేనేజర్ రసెల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు.

Also Read: Maanvi Gagroo: బాలీవుడ్‌ను ఆడేసుకుంటున్న కరోనా.. స్టార్ డైరెక్టర్, హీరోయిన్‌కు పాజిటివ్!!

హారిస్‌ రవూఫ్‌ పోస్ట్ చేసిన ట్వీటుకు సీఎస్కే మేనేజర్ రసెల్‌ రీట్వీట్‌ చేస్తూ.. ఎంఎస్ ధోనీ మాటిస్తే నిలబెట్టుకుంటాడు అని చెప్పాడు. పాక్‌ పేసర్‌ హారిస్‌ రవూఫ్‌కు ధోనీ అంటే చాలా ఇష్టం. ధోనీతో కలిసి ఆడే అవకాశం రాకపోయినా.. రావుఫ్ ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2021 (T20 World Cup) సందర్భంగా తన అభిమాన క్రికెటర్‌ను కలిశాడు. మ్యాచ్‌ అనంతరం ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. అప్పుడు మహీ పాక్‌ పేసర్‌కు విలువైన సూచనలు చేశాడు. అప్పుడు తన జెర్సీ కావాలని రవూఫ్‌ అడగ్గా.. ధోనీ తాజాగా పంపించి అతడిని సంతోష పరిచాడు. మహీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా.. ఐపీఎల్ (IPL) టోర్నీలో ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. 

Also Read: Shyam Singha Roy on OTT : ఓటీటీలో శ్యామ్‌ సింగరాయ్‌.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News