Tollywood Hero Priyanth Rao Arrested on Harrasment Case: సినీ పరిశ్రమ రంగుల ప్రపంచం ఇక్కడ వెలిగిపోవాలని అనేక ప్రాంతాల నుంచి అనేకమంది వస్తూ ఉంటారు. అయితే వారిలో వేళ్ళ మీద లెక్కపెట్టే సంఖ్యలో సినిమాలలో మెరుస్తూ ఉంటారు. మిగతా వారందరూ వేరే ఏదో ఒక పని చేస్తూ స్థిరపడడమో లేక సినీ పరిశ్రమలో ఏదో ఒక అవకాశం రాకపోతుందా అని అన్ని విషయాలను కాంప్రమైజ్ అవ్వడమో చేస్తూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తాజాగా ప్రేమ పేరుతో తనను వంచించి అత్యాచారం చేశాడంటూ ఒక నటుడిపై జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కొన్ని నెలలుగా పరారీలో ఉన్న సదరు వ్యక్తిని పట్టుకుని అరెస్టు చేశారు. హైదరాబాద్ పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం కొత్తగా మా ప్రయాణం అనే సినిమాతో ప్రియాంత్ రావు అనే వ్యక్తి తెలుగు హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రియాంత్ కు ఒక జూనియర్ ఆర్టిస్టుతో పరిచయం ఏర్పడగా అది ప్రేమకు దారితీసింది.


పరిచయమైన రెండు నెలల తర్వాత ఆమెకు ప్రియాంత్ ప్రపోజ్ చేయడంతో ఆమె కూడా ప్రియాంత్ ప్రేమను అంగీకరించింది. అప్పటి నుంచి వారి మధ్య ప్రేమాయణం మొదలైంది. ఒకరోజు హైదరాబాద్ నగర శివారులోని ప్రగతి రిసార్ట్ కు తీసుకెళ్లిన ప్రియాంత్ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెను శారీరకంగా దగ్గర చేసుకున్నాడు. అప్పటినుంచి ఆమెను శారీరకంగా వాడుకుంటూ వస్తున్నాడు అయితే ఈ మధ్యకాలంలో బాధితురాలు నెల తప్పడంతో ప్రియాంత్ ఆమెకి మొహం చాటేయడం మొదలుపెట్టాడు.


ఇప్పుడు కరెక్ట్ కాదని చెబుతూ అబార్షన్ కోసం ఆమెకు మందులు కూడా ఇవ్వడంతో ఆమె ఆరోగ్యం పాడైంది. అంతేగాక ఈ విషయం గనుక బయట తెలిస్తే చంపేస్తానని బెదిరిస్తూ ఉండడంతో బాధితురాలు జూలై 9వ తేదీన హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటినుంచి ప్రియాంత్ కోసం గాలిస్తున్నారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న సదరు హీరో తాజాగా పోలీసులకు చిక్కడంతో అతనిని వెంటనే అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఎవరు అనే విషయాన్ని మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచారు. ప్రియాంత్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరిచే దిశగా చర్యలు చేపట్టారు.


Also Read: Pawan Kalyan's Remake Movie : ఆగిపోయిన పవన్ రీమేక్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు!


Also Read: Zee Telugu Kutumbam Awards: సుధీర్-ప్రదీప్-శ్రీముఖిల సందడితో జీ తెలుగు కుటుంబం అవార్డ్స్... ఆరోజునే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook