Neha Desh Pandey Husband: ఏపీ మాజీ మంత్రి బంధువుతో డ్రగ్స్ వ్యాపారం.. టాలీవుడ్ హీరోయిన్ భర్త అరెస్ట్!
Tollywood Heroine Neha Desh Pandey Husband Arrested: టాలీవుడ్ హీరోయిన్ భర్త ఒకరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు, ఆయనతో పాటు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక మాజీ మంత్రి బంధువు కూడా అరెస్ట్ అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళితే
Tollywood Heroine Neha Desh Pandey Husband Myron Mohith Arrested: టాలీవుడ్‌కు చెందిన చెందిన ప్రముఖ హీరోయిన్ భర్తను, ఒక ఏపీ మాజీ మంత్రి బంధువును పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. నటి నేహా దేశ్ పాండే భర్త అయిన మైరాన్ రోహిత్ ఇంటర్నేషనల్ డీజే ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయనని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ సహా గోవా, ముంబై నగరాల్లో డ్రగ్స్ సరఫరా చేసేవారితో మోహిత్‌కు పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు దాదాపు వందకు పైగా డీజేలను తన లిస్టులో పెట్టుకుని గోవాతో పాటు దేశంలోని పలు నగరాల్లో డీజేలు నిర్వహిస్తూ ఆ డీజే షోల ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. గోవా డ్రగ్స్ కేసులో కీలక నిందితుడయిన ఎడ్విన్ తో మైరాన్ రోహిత్ కు పరిచయాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అతను ఒక్కడే కాదు 50 మందికి పైగా డ్రగ్ పెడ్లర్స్ తో అతనికి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు.
ముంబై, గోవా, బెంగళూరు, హైదరాబాద్ పబ్ లకు డీజేలతో మైరాన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని, సన్ బర్న్ లో జరిగే పార్టీలకు కూడా మైరాన్ డ్రగ్ సరపర చేస్తున్నాడని అంటున్నారు. టాలీవుడ్ నటి నేహా దేశ్ పాండే ను వివాహం చేసుకున్న రోహిత్ కు టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు వ్యాపారవేత్తలతో లింకులు ఉన్నాయని అంటున్నారు. ముంబైలో పబ్ వెయిటర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు అక్కడే మకాం వేసి దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
మైరాన్ కాంటాక్టులను వెలికి తీసిన పోలీసులు అతనితో పాటు మన్యం కృష్ణ కిషోర్ ని తిరిగి కస్టడీలోకి తీసుకోనున్నారు. గత కొంతకాలం నుంచి కృష్ణ కిషోర్డుతో పరిచయాలు పెంచుకున్న మైరాన్ హైదరాబాద్ కు డ్రగ్స్ అతనితో పంపిస్తున్నట్టు తెలుస్తోంది. బెంగళూరు, గోవాల మీదుగా హైదరాబాద్ కి డ్రగ్స్ ను కృష్ణ కిషోర్ రెడ్డి తెప్పిస్తున్నట్టు గుర్తించారు. సూపర్ లగ్జరీ బస్సులో పార్సెల్ రూపంలో డ్రగ్స్ ను తీసుకొస్తున్న కృష్ణ కిషోర్ రెడ్డి ఇక్కడ అమ్మకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎడ్విన్, మైరాన్ లతో కొంతకాలం నుంచి పరిచయాలు పెంచుకున్న కృష్ణ కిషోర్ రెడ్డి వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సప్లయర్ గా గుర్తించిన పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
కెఎంసి ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న కృష్ణ కిషోర్ రెడ్డి ప్రముఖ బిల్లర్గా కొనసాగుతూ తెలంగాణ, ఏపీలో కాంట్రాక్ట్ లు నిర్వహిస్తున్నారు. ఇక నేహా దేశ్‌పాండే మోడల్ గా టాలివుడ్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. 2014లో దిల్ దీవానా సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ ఇప్పటి వరకూ దాదాపు ఎనిమిది సినిమాల్లో నటించింది. ఇక ఆటో రామ్ ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్న పీప్ షో సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. మైరాన్ నేహా దేశ్ పాండే ద్వారా డ్రగ్స్ సరఫరా చేశాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook