Tollywood News: మొన్నటి వరకూ వరుస పరాజయాలతో కెరీర్ ముగిసిందన్పించిన రవితేజ ధమాకా సినిమాతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చేశాడు. ఇప్పుడు విరామం లేకుండా వరుస సినిమాలను సిద్ధం చేసుకున్నాడు. పోయిన అవకాశాల్ని మళ్లీ చేజిక్కించుకుని బిజీగా మారుతున్నాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రవితేజది ప్రత్యేక స్థానం. ఏ గాడ్ ఫాదర్ లేకుండా కష్టపడి పైకొచ్చిన నటుడు. అంతేకాదు రవితేజతో సినిమా అంటే నిర్మాతలకు మినిమమ్ ప్రోఫిట్స్ గ్యారంటీ అనే నమ్మకముంది టాలీవుడ్‌లో. టాలీవుడ్‌లో మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్న రవితేజ కెరీర్‌లో ఎత్తుపల్లాలు చాలానే ఉన్నాయి. గతంలో వరుస పరాజయాలు వెన్నాడినప్పుడు క్రాక్ సినిమా అతని కెరీర్‌ని నిలబెట్టింది. ఆ తరువాత వరుసగా మూడు డిజాస్టర్లు పలకరించడంతో ఇక కెరీర్ ముగిసిందనుకున్నారంతా. అవకాశాలు రావడం కష్టమే అన్నారు. అయితే విమర్శల్ని తట్టుకుని కష్టాన్ని నమ్మకుని ముందుకు సాగిపోయాడు. ఫలితం ధమాకా రూపంలో మరో బంపర్ హిట్. అంతే మరోసారి కెరీర్ దూసుకుపోతోంది. 


ధమాకా సినిమా హిట్ తరువాత వరుసగా విభిన్నమైన మాస్ యాక్షన్ సినిమాలకు ఓకే చెప్పేశాడు. వరుసగా ఆరు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఒక్కొక్క సినిమాకు 20 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. మిరపకాయతో సక్సెస్ అందుకున్న రవితేజ ఆ సినిమా దర్శకుడు హరీష్ శంకర్‌తో మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. అదే విధంగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సినిమాకు ఒప్పుకున్నాడు. 


సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేయనున్న సినిమాకు దిల్ రాజు ఇప్పటికే అడ్వాన్స్ చెల్లింపులు కూడా చేశాడు. త్రినాథరావు నక్కిన తెరకెక్కించనున్న మరో సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. దాంతోపాటు కలర్ ఫోటో దర్శకుడితో మరో సినిమా వస్తున్నట్టు సమాచారం. ఇక అభిషేక్ నామ ప్రొడక్షన్స్‌తో మరో సినిమా చేయనున్నాడు రవితేజ. అంటే మొత్తం ఆరు సినిమాలతో కెరీర్ బిజీ అయిపోయింది. అన్నీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలయ్యేందుకు చాలా సమయమే పట్టవచ్చు. ఇవి బాక్సాఫీసు వద్ద ఎలా ఉంటాయనేది ఆసక్తి కల్గించే అంశంగా ఉంది.


Also read: Salaar Movie Teaser: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్‌డేట్.. సలార్ టీజర్ డేట్ ఇదే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook