Me Too in Tollywood: మలయాళం సినీ ఇండస్ట్రీలో జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక పెను సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మలయాళీ ఇండస్ట్రీలోని ఎంతోమంది హీరోయిన్స్.. తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా చెబుతున్నారు. దీంతో మలయాళం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ విషయంపై తెగ చర్చ జరుగుతోంది. ఇక మలయాళీ ఇండస్ట్రీలో ఇది మొదలైన దగ్గర నుంచి.. సౌత్ ఇండియాలోని మిగతా ఇండస్ట్రీలు కూడా.. దీన్ని అమలు చెయ్యాలి అంటూ.. కొంతమంది కోరుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా హేమ కమిటీ లాంటి దాన్ని ఏర్పాటు చేయాలని ఈ మధ్యనే సమంతతో పాటు పలువురు హీరోయిన్స్ డిమాండ్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలో మా అధ్యక్షులు మంచు విష్ణు తెలంగాణ ప్రభుత్వానికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి చెయ్యడం విశేషం. టాలీవుడ్ ఇండస్ట్రీలో.. పనిచేస్తున్న మహిళల రక్షణ మేరకు.. వారి తరపున ప్రాతినిధ్యం వహించేందుకు.. ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చెయ్యాలి అంటూ.. మంచు విష్ణు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఇదే విషయాన్ని ట్విట్టర్.. వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.


 



మా అధ్యక్షుడిగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కి, సినిమాటోగ్రఫీశాఖ మంత్రులకు.. నాదొక విజ్ఞప్తి. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో.. మహిళలకు రక్షణ, భద్రత మరింత మెరుగుపడేలా మనం చూసుకోవాలి. వారందరి తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఓ కమిషన్‌ ఏర్పాటు చేయవలసినదిగా కోరుతున్నాను. కెమెరా ముందే కాదు కెమెరా వెనుక కూడా.. ప్రతి ఒక్కరికీ భద్రతతో కూడిన పరిస్థితులు ఉండాలి అనే విషయాన్ని.. మేము అందరం చాలా ప్రాధాన్యం ఇస్తున్నాం. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి ‘మా’ ఎప్పుడూ కట్టుబడి ఉంటది. మహిళ భద్రత, సాధికారితకు ప్రతిరూపంలా నిలిపేందుకు తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరి నుంచి సలహాలు, సూచనలను మేము ఆహ్వానిస్తున్నాం’ అని మంచి విష్ణు తన ట్విట్టర్ అకౌంట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో రేవంత్ రెడ్డి ఇలాంటి కమిటీని ఏర్పాటు చేస్తే.. ఎలాంటి నిజాలు బయటపడుతాయో వేచి చూడాలి.


Read more: Ola auto driver: రెచ్చిపోయిన ఓలా డ్రైవర్.. రైడ్ క్యాన్షిల్ చేసిందని యువతిని కొట్టి.. షాకింగ్ వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.