Tollywood unfinished movies: స్టార్ హీరోలతో సినిమా అంటే ఆషామాషీ కాదు అన్నీ కుదుర్చుకున్నాకే ముహూర్తం షార్ట్ మొదలవుతుంది. అలాంటిది కొన్ని సినిమాలు మొత్తం షార్ట్ అయ్యాక ఏదో ఒక కారణంతో ఆగిపోవడం జరిగింది. చిన్నాచితికా హీరోల సినిమాలు అయితే ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోవచ్చు. బడాబడా స్టార్ హీరోల సినిమాలు కూడా ఇలా ఆగిపోవడం ఆశ్చర్యమే. మరి అలా మొదలుపెట్టి షూటింగ్ పట్టాలెక్కకుండానే అటకెక్కిన ఆ స్టార్ హీరోల సినిమాలు ఏమిటో తెలుసా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పవన్ కళ్యాణ్ హీరోగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో అగ్ర నిర్మాత ఏ.యం రత్నం నిర్మాణ సారధ్యంలో 2003లో అనౌన్స్ చేసిన సత్యాగ్రహి చిత్రం తెలియని కారణాలవల్ల ముహూర్తం తర్వాత ఆగిపోయింది. 


బాలయ్య ఎంతో ప్రెస్టేజీయస్ గా మొదలుపెట్టిన నర్తనశాల చిత్రం 17 రోజుల షూటింగ్ తర్వాత షూటింగ్ ఆగిపోయింది. 


రామ్ చరణ్ డ్రీం ప్రాజెక్ట్ అయినా మెరుపు మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ డ్రామా... ఈ మూవీ కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆగిపోవడం జరిగింది.


వీటితో పాటుగా పవన్ కళ్యాణ్ హీరోగా సింగీతం శ్రీనివాస్ తెరకెక్కించాలనుకున్న జీసస్ క్రైస్ట్ మూవీ అనౌన్స్మెంట్ తరువాత ఏమైందో ఎవరికీ తెలియదు. 


కొరటాల శివ, రామ్ చరణ్ కాంబోలో రావలసిన మూవీ కూడా ముహూర్తం తర్వాత ఆగిపోయింది. 


చిరంజీవి బాగ్దాద్ గజదొంగ మూవీ షూటింగ్ మొదలుపెట్టిన కొన్ని రోజుల తర్వాత తెలియని కారణాలవల్ల ఆగిపోయింది. 


బి.గోపాల్ ,బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కవలసిన హర హర మహాదేవ చిత్రం కూడా ముహూర్తం తర్వాత ఆగిపోయింది. 


ఇక బాలయ్య విక్రమ సింహభూపతి.. 80% షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఈ మూవీ సడన్ గా ఆగిపోయింది.


కొన్ని సినిమాలు ఎన్ని ఆటంకాలు వచ్చినా లెక్కచేయకుండా సునాయాసంగా పూర్తయి మన ముందుకు వస్తున్నాయి. మరికొన్ని సినిమాలు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత.. పూజా కార్యక్రమం పూర్తయ్యాక.. ముహూర్తం షార్ట్ కి క్లాప్ కొట్టాక.. వేరు వేరు కారణాలవల్ల ఆగిపోతుంటాయి. స్టార్ హీరోలైన ఈ తిప్పలు తప్పవు మరి.. మొత్తానికి చిరంజీవి దగ్గర నుంచి బాలయ్య వరకు..పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి రామ్ చరణ్ వరకు .. ఈ సిట్యువేషన్ ని ఎదుర్కొన్న వారే.


Also Read: CM Jagan: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్.. ఒక్కొక్కరికి రూ.లక్షన్నర వరకు..!


Also Read: Revanth Reddy: మీ ఆత్మగౌరవాన్ని ఒక ఫుల్ బాటిల్‌కో.. ఐదు వేలకో తాకట్టు పెట్టకండి: రేవంత్ రెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook