Mahesh Babu Knee Surgery: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మోకాలికి మైనర్ సర్జరీ జరగనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మహేష్.. తన కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ సీక్వెన్స్ లో గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో వైద్యులను సంప్రదించగా.. మోకాలికి మైనర్ సర్జరీ అవసరమని చెప్పినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో మోకాలి సర్జరీ కోసం త్వరలోనే ఆయన అమెరికా వెళ్లనున్నారని తెలుస్తోంది. సర్జరీ పూర్తైన తర్వాత మహేష్ బాబు రెండు నెలలు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని సినీ పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.


మహేష్ బాబుకు 2014 నుంచి మోకాలికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. గతంలో కొన్ని సార్లు మోకాలి నొప్పి ఆయన్ని వేధించినా.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని, తిరిగి షూటింగ్ లో పాల్గొనే వారు మహేష్. అయితే సర్జరీ చేయించుకోకుండా.. ఉండడం వల్ల మోకాలి నొప్పి ఇప్పుడు తీవ్రమైందని సమాచారం. దీంతో సర్జరీ తప్పదని వైద్యులు సంప్రదించినట్లు తెలుస్తోంది.


మహేష్.. త్వరలోనే మోకాలి సర్జరీ చేయించుకునేందుకు యూఎస్ఏ వెళ్లనున్నారని తెలుసుకున్న ఫ్యాన్స్.. ఆయన తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. మోకాలి నొప్పి నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన ఫ్యాన్స్ దేవుడ్ని ప్రార్ధిస్తున్నారు.  





మహేష్ బాబు.. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీస్ మేకర్స్, 14 రీల్స్ పతాకాలపై రూపొందుతోన్న ఈ చిత్రానికి నవీన్ యర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమాకు సంతకం చేశారు మహేష్ బాబు.


Also Read: Kamal Haasan Corona: కొవిడ్ నుంచి కోలుకున్న కమల్ హాసన్.. డిసెంబరు 3న డిశ్చార్జ్


Also Read: Ajith requests not to call him Thala : తల అని పిలవొద్దంటున్న హీరో అజిత్..కారణం ఏమిటో మరి! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook