Tamil Star Ajith requests everyone not to call him Thala, Call Him Just Ajith Or AK : తమిళ హీరో అజిత్‌కు కోలివుడ్‌లో ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంది. తమిళ్, తెలుగుతో పాటు పలు భాషల్లో అజిత్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అజిత్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కోలివుడ్‌లో అజిత్‌ను (Ajith) ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో అభిమానంతో.. తల (Thala) అని పిలుస్తుంటారు.
ఇక మీడియా కూడా అజిత్ పేరు తల అని యాడ్ చేస్తూ ఉంటుంది. తమిళంలో (Tamil) తల అంటే నాయకుడు అని అర్థం. అయితే తాజాగా అజిత్ మీడియాకు తన ఫ్యాన్స్‌కు ఒక రెక్వెస్ట్ చేశాడు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశాడు అజిత్.
ఇక నుంచి తనను తల అని పిలవవొద్దు అంటూ కోరాడు అజిత్. ఈ మేరకు ఆయన మేనేజర్ సురేశ్ చంద్ర (Suresh Chandra) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇకపై తనను తల అని ఎవరూ పిలవవొద్దు.. రాయొద్దు అని కోరారు. తన పేరుకు ముందు తల అని మాత్రమే కాదు మరే ఇతర బిరుదులను యాడ్ చేయొద్దు అని విజ్ఞప్తి చేశాడు అజిత్. తనని అజిత్, అజిత్ కుమార్ లేదా ఏకే (Ajith Or AK) అని మాత్రమే పిలవండి..రాయండి అని కోరాడు.
— Suresh Chandra (@SureshChandraa) December 1, 2021
Also Read : Kamal Haasan Corona: కొవిడ్ నుంచి కోలుకున్న కమల్ హాసన్.. డిసెంబరు 3న డిశ్చార్జ్
అయితే అజిత్ ఇలా సడెన్‌గా సోషల్ మీడియా ద్వారా ప్రకటన ఇవ్వడానికి కారణమేంటో మాత్రమే చెప్పలేదు. ఈ పోస్ట్ వెనుక ఉన్న అంతర్యం ఏమిటి అని అభిమానులు ఆలోచిస్తున్నారు.అయితే ఏఆర్ మురగదాస్ (Murugadoss) తెరకెక్కించిన ధీన (Dheena) మూవీతో అజిత్‌కు మాస్ ఇమేజ్ వచ్చింది. ఈ మూవీతో అజిత్ ను ఫ్యాన్స్ అంతా కూడా తల అని పిలవడం స్టార్ట్ చేశారు. అజిత్ ఒక స్టార్ హీరోలా కాకుండా, సాధారాణ మనిషిగా ప్రజల్లో కలసిపోయే స్వభావం గల హీరో. ఇక ప్రస్తుతం అజిత్ (Ajith) వాలిమై మూవీలో నటిస్తున్నారు. వినోద్ డైరెక్షన్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.
Also Read : Mehndi Blouse: జాకెట్‌కు బదులు మెహందీ బ్లౌజ్-ఆ మహిళను తిట్టిపోస్తున్న నెటిజన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook