Tollywood Producer Pleasing hero : ఈ రోజుల్లో స్టార్ హీరోను ఒక కథ చెప్పి ఒప్పించాలంటే మామూలు విషయం కాదు. అసలు సినిమా బాగోక పోతే ఏ మాత్రం ఆలోచన లేకుండా పక్కన పెట్టేస్తున్నారు ప్రేక్షకులు. అందుకే ఒక సినిమా ఒప్పుకోవాలంటే ఆ సినిమా దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు? అది థియేటర్ కు ఏమేరకు వర్కౌట్  అని 100 లెక్కలు వేసుకుని నాకు గాని సినిమా ఓకే చేయడం లేదు. హీరోలు ఎలా ఉన్నా సరే నిర్మాతలు మాత్రం ఎంత సేపు వారిని కాకా పట్టి ఎలా అయినా తనతో ఒక సినిమా చేయించేలా ప్లాన్ చేసుకుంటే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పటి నిర్మాతలలో ఉన్న డెడికేషన్ లాంటి పదాలు నేటి నిర్మాతలలో వెతుక్కోవాలి అంటే అది కష్టమే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు కేవలం వ్యాపార దృష్టితో మాత్రమే చాలా వరకు నిర్మాతలు సినిమాలు చేస్తున్నారు. చేతిలో ఒక్క రూపాయి కూడా లేకపోయినా ఒక స్టార్ హీరో డేట్స్ గనుక ఉంటే ఎలాగైనా ఫైనాన్స్ వచ్చేస్తుంది ఆ ఫైనాన్స్ వస్తే సినిమా పూర్తి చేసి అమ్ముకుని డబ్బులు సంపాదించవచ్చు. కేవలం ఇదే ఫార్ములా మీద కొంత మంది నిర్మాతలు వర్కౌట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఒక ప్రొడ్యూసర్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగానే ప్రొడ్యూసర్లు హీరోలను కాకా పట్టేందుకు వారి దగ్గరకు వెళ్లిన సమయంలో వారికి ఇష్టమైన వస్తువులు తీసుకు వెళుతూ ఉంటారు. 


గోదావరి జిల్లాల నుంచి తెప్పించిన నాన్ వెజ్ స్పెషల్స్, మందు, పలు రకాల స్వీట్లు, హీరోల భార్యలు ఉంటే వారికి బంగారం, పిల్లలు ఉంటే వాళ్లకు చాక్లెట్లు, ఖరీదైన వాచీలు లాంటివి తీసుకెళ్లి తమ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ మధ్యనే ఒక జర్మన్ షెపర్డ్ కుక్క పిల్లను కొనుక్కున్న ఒక హీరో దగ్గరకు వెళ్లిన సదరు నిర్మాత వారి కుటుంబ సభ్యులకు తీసుకెళ్లిన బహుమతులతో పాటు సదరు కుక్కపిల్లకు రెండు నెలలకు సరిపడా పెడిగ్రీ, అలాగే కుక్క బిస్కట్లు తీసుకువెళ్లారట. ఇంత కష్టపడి కుక్క బిస్కెట్లు కూడా తీసుకు వెళితే ఆ హీరో మాత్రం నిర్మాతకు ఇంకా గ్రీన్ సిగ్నల్ మాత్రం ఇవ్వలేదట. డేట్స్ ఇస్తాను కానీ మంచి కథ తీసుకురమ్మని నేరుగా మొహం మీద చెప్పేశాడట. 


దీంతో హీరోని నమ్ముకోవడం కంటే మంచి దర్శకుడిని పట్టుకుని ఆ తర్వాత హీరో వెంట పడటం మేలు అని భావించిన సదరు నిర్మాత ఇప్పుడు ఆ పనిలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. మొత్తంమీద ఇలా కుక్క పిల్లను కూడా తృప్తి పరచడం కోసం బిస్కెట్లు పెడిగ్రీ తీసుకు వెళ్ళిన విషయం మాత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పక తప్పదు. నిజానికి హీరోలను ఒకరకంగా ఈవెంట్లలో వ్యక్తి పూజ చేస్తూ వారు లేకపోతే మేము లేము అన్నట్లు మాట్లాడుతూ వస్తున్నా చివరికి కధే హీరో అని హీరోలే అర్ధమయ్యేలా చెబుతున్నారు. 
Also Read: Tollywood Stars to OTT : డిజిటల్లోకి దూసుకుపోతున్న స్టార్లు ఎవరెవరంటే?


Also Read: Sai Pallavi Effect : విరాటపర్వాన్ని 'విషాదపర్వం'గా మార్చేసిందిగా.. డిజాస్టర్ కలెక్షన్స్ తో నిర్మాతలు ఫైర్!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook