రానా- సాయి పల్లవి జంటగా రూపొందిన విరాటపర్వం సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా విడుదల ఎప్పుడో కావాల్సి ఉన్నా కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడింది. పెద్ద సినిమాలు అన్నీ విడుదల అయిపోవడంతో ఈ సినిమాను జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని ప్రకటించారు. పెద్ద ఎత్తున విడుదల చేయాలని భావించి సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా ప్లాన్ చేశారు. నీది నాది ఒకే కథ దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద ముందు పెద్దగా అంచనాలు లేవు కానీ ఈ సినిమా వరంగల్ జిల్లాకు చెందిన తూము సరళ అనే మహిళ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించామని యూనిట్ ప్రకటించింది. అంతే కాదు హీరోయిన్ సాయి పల్లవితో కలిసి వెళ్లి సరళ కుటుంబాన్ని కలిసి రావడంతో ఒక్కసారిగా సినిమా మీద చర్చ మొదలైంది. అయితే రానా-సాయి పల్లవి, దర్శకుడు వేణు ఊడుగుల అలాగే మిగతా నటీనటులు, సినిమా క్రూ ఇలా దాదాపు ఎవరు కుదిరితే వారు సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. అందులో భాగంగానే ఈ సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పెద్ద చర్చకు తెరతీసింది.
టెర్రరిస్టులు -నక్సలైట్లు అనే చర్చ మొదలైన క్రమంలో మీరు లెఫ్టిస్టా? లేక రైటిస్టా అంటూ యాంకర్ ప్రశ్నించారు. ఈ క్రమంలో సాయి పల్లవి మాట్లాడుతూ తాను ఒక న్యూట్రల్ ఫ్యామిలీ నుంచి వచ్చానని..అందుకే న్యూట్రల్‌గా ఉంటానని తెలిపారు. అణచివేతకు గురయ్యే వారిని రక్షించే మనస్తత్వమని ఆమె చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రస్తావనకు రావడంతో ఆమె మాట్లాడుతూ మతం ప్రాతిపదికన జరిగే ఈ దాడుల వ్యవహారాన్ని గురించి చెప్పాలంటే అప్పుడు కాశ్మీరీ పండిట్ల మీద జరిగిన దాడికి, గో రక్షకులు అంటూ ముస్లిం డ్రైవర్ల మీద చేస్తున్నదాడులకు తేడా ఏముందని ప్రశ్నించింది. ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారడంతో సినిమా విడుదలకు ముందే సినిమాను బ్యాన్ చేయాలని హిందుత్వ వాదులు పిలుపునిచ్చారు. సాయి పల్లవి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా తప్పు పట్టారు. ఖచ్చితంగా ఆమె క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇటు నెటిజన్ల నుంచి విమర్శలు వినిపించాయి. అయితే అంత రచ్చ జరిగితే సినిమా యూనిట్ పెద్దగా స్పందించే ప్రయత్నం చేయలేదు. సినిమా విడుదలైన తర్వాత మంచి టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రమే అయ్యాయి.
మొదటిరోజే కోటి లోపు కలెక్షన్స్ రావడంతో సినిమా యూనిట్ మేలుకొంది. ఈ క్రమంలో సాయి పల్లవి చేత క్షమాపణలు చెప్పిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. అయితే ఆమె వ్యాఖ్యలు జనాల్లోకి వెళ్లినంత బాగా క్షమాపణలు వెళ్ళలేదు. దీంతో ఈ సినిమా వసూళ్లు రోజు రోజుకూ తగ్గుతూనే వస్తున్నాయి కానీ పెరుగుతున్న పాపాన పోలేదు. ప్రతి రోజు ఈ కలెక్షన్స్ చూసిన నిర్మాతలు ఇప్పుడు దీనికి కారణం సాయి పల్లవినే అనే నిర్ధారణకు వచ్చి ఆమె మీద ఫైర్ అవుతున్నారని తెలుస్తోంది. ఉన్న చోట ఉండకుండా ఇలా కామెంట్ చేయడం ఎందుకంటూ ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ కలెక్షన్స్ విషయంలో ఆమె ఇప్పుడు ప్రధాన దోషిగా కనిపిస్తోంది. ఎందుకంటే అమీర్ ఖాన్ లాంటి హీరోలకే ఇలా యాంటీ హిందూ కామెంట్స్ చేసినప్పుడు వారి సినిమాల కలెక్షన్స్ మీద ప్రభావం పడింది. ఈ దెబ్బకు సాయి పల్లవి విషయంలో జాగ్రత్త పడిన నిర్మాతలు ఇంకా ఏమి చేయచ్చా? అనే ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. ఏదైనా ప్రెస్ మీట్ పెట్టించి ఆమె చేత సారీ చెప్పించవచ్చా అనే విషయం మీద కూడా ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చూడాల్సి ఉంది.
అయితే మరోపక్క సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ టాగ్ రావడం అనే మీద కూడా చర్చ జరుగుతోంది. పవర్ స్టార్ అనే టాగ్ చాలా పెద్దది, ఎందుకంటే సినిమా హిట్ ఫ్లాప్ అనే లెక్కలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ వసూళ్లు రాబడతారు. ఇక అలాంటి టాగ్ ను లేడీ పవర్ స్టార్ అనే టాగ్ ను సాయి పల్లవికి ఇవ్వడం కరెక్ట్ కాదనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే సాయి పల్లవి గట్టిగా పట్టుమని పది సినిమాలు చేయలేదు. సినిమాల సంగతి పక్కన పెడితే ఆమెకు అలాంటి భారీ కలెక్షన్స్ ఉన్న సినిమాలు ఉన్నాయా? అంటే కాదనే చెప్పాలి. నిజానికి ఆమెకు అంత పెద్ద టాగ్ ఇవ్వడాన్ని ఆమె కూడా తోసిపుచ్చింది. కానీ ఈ వాదన మాత్రం ఇప్పుడు ఆమెకు నెగటివ్ అవ్వడం ఖాయమే అంటున్నారు విశ్లేషకులు. విరాటపర్వం అంటూ భారీ అంచనాలతో వచ్చిన సినిమాను సాయి పల్లవి విషాద పర్వంగా మార్చిందని అంటున్నారు.
Also Read:Sai Pallavi Marriage: త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సాయి పల్లవి? ఇందులో నిజమెంత?
Also Read:Sai Pallavi remuneration: సాయి పల్లవి పారితోషికం ఎంతో తెలుసా ...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook