Vijay Devarakopnda: అనతికాలంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో ముఖ్యంగా ఉత్తరాదిన ప్రాచుర్యం పొందిన హీరో. గత కొద్దికాలంగా అనసూయకు విజయ్‌కు మధ్య ఏం జరిగిందనే విషయంపై చర్చ నడుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి విజయ్ దేవరకొండ నటించిన ప్రేమ, కుటుంబ కధాచిత్రం ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానున్న సందర్భంగా విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికకరమైన విషయాలను పంచుకున్నారు. ఖుషి సినిమా తనకు బాగా నచ్చిన ప్రేమ కథ అని చెప్పారు. వాస్తవానికి ప్రేమ కధలు చేయకూడదనుకున్నానని..కానీ ఖుషి కధ విన్నాక బాగా నచ్చిందన్నారు. వెబ్ సిరీస్‌లపై ఆసక్తి లేదని, చేయాలనే ఆలోచన లేదని చెప్పాడు. ఇక పెళ్లి గురించి కీలకమైన విషయల్ని మీడియాతో షేర్ చేశాడు. గత కొద్దికాలంగా మంచి భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నానన్నారు. ఇప్పుడు వెంటనే పెళ్లి చేసుకోకపోయినా..త్వరలో అంటే 2-3 ఏళ్లలో పెళ్లి చేసుకుంటానన్నాడు. ఇక సోషల్ మీడియాలో అనసూయతో గొడవల విషయంలో మాట్లాడాడు. అసలేం జరుగుుతుందో కూడా తనకు తెలియదన్నారు. తనకు ఈ విషయంలో సంబంధం లేదన్నారు. ఎవరైనా గొడవపడ్డారో వాళ్లనే అడగమంటున్నాడు విజయ్ దేవరకొండ.


ఏదైనా సినిమా ఆడకపోతే బాధ కలుగుతుందన్నారు. లైగర్ కంటే ముందు కూడా చాలా ఫ్లాప్స్ ఎదుర్కొన్నానన్నారు. ఎదురుదెబ్బలు తిని కిందకు పడిపోయినా తిరిగి లేచి నిలబడే మనస్తత్వం తనదన్నాడు.


Also read: Bhola Shankar: భోళాశంకర్ సినిమా టికెట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం నిర్ణయమిదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook