Bhola Shankar: భోళాశంకర్ సినిమా టికెట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం నిర్ణయమిదే

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా టికెట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. సినిమా టికెట్ల పెంపుపై ప్రభుత్వం ఓ విధానం ప్రకారం నడుచుకుంటుందన్నారు.య పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 10, 2023, 01:46 AM IST
Bhola Shankar: భోళాశంకర్ సినిమా టికెట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం నిర్ణయమిదే

Bhola Shankar: టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, పపన్ కళ్యాణా్‌లపై ఘాటు విమర్శలు చేసిన ఏపీ ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్షారెడ్డి ఇతర అంశాలపై కూడా స్పందించారు. సినిమా టికెట్ల పెంపుపై ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు మీ కోసం..

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. ఈలోగా ఈ సినిమాకు టికెట్లు పెంచుకునేందుకు అవకాశమివ్వాలని చిత్ర నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారు. అయితే తగిన ఫార్మట్‌లో నిబంధనల ప్రకారం మరోసారి అప్లై చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇదే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్జి వివరించారు. చంద్రబాబు హయాంలో బాలకృష్ణకు ఓ న్యాయం, మిగిలిన వారికి ఓ న్యాయం అన్నట్టు తాము వ్యవహరించలేదన్నారు. సినిమాల్లో బడ్జెట్ లింక్డ్ టికెటింగ్ వ్యవస్థను తాము అమలు చేస్తున్నామని సజ్జల గుర్తు చేశారు. ఎవరైనా సరే తమ సినిమా బడ్జెట్‌కు సంబంధించి కాగితాలు సమర్పించి టికెట్లు పెంచుకోవచ్చన్నారు. 

ఏదైనా సినిమా బడ్జెట్ 100 కోట్లు ఉందనుకుంటే..అందుకు సంబంధి రుజువులుంటే చాలని భావించారు. ఈ నిబంధన ఏ సినిమా హీరోకైనా వర్తిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. భోళాశంకర్ సినిమా కూడా 100 కోట్ల బడ్జెట్ దాటుంటే తగిన ఆధారాలు సమర్పించి టికెట్లు పెంచుకోవచ్చని సూచించారు. సినిమా టికెట్ల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించిన వైఎస్ జగన్‌ను గతంలో ప్రశంసించారు. 

రాష్ట్రంలోని వ్యవస్థల్లో అన్ని సక్రమంగా జరుగుతున్నప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు ఆంతర్యం ఏంటో తనకతు అర్ధం కావడం లేదన్నారు. మనసులో ఒకటి పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న మరో పార్టీని ఇరకాటంలో పడేసేందుకు ప్రయ్నాలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎవరి ప్రయోజనాలో కాపాడేందుకు చిరంజీవి ప్రయత్నిస్తున్నారన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఓ పాలసీ ఉంటుందనేది తెలియాలని ప్రశ్నించారు. 

Also read: AP Government: అర్ధరాత్రి విద్యుత్ ఉద్యోగుల సమ్మె, ప్రభుత్వంతో చర్చలు సఫలం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News