Balakrishna Knee Surgery: టాలీవుడ్ అగ్ర నటుడు, నటసింహం నందమూరి బాలకృష్ణకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి వైరల్ అవుతోంది. బాలకృష్ణ మరో సర్జరీ చేయించుకోవడమే దీనికి కారణం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవర్‌గ్రీన్ ఎనర్జిటిక్ హీరో ఎవరంటే నందమూరి బాలకృష్ణ పేరు చెప్పుకోవల్సిందే. ఇప్పటికీ వరుస సినిమాలతో బాలయ్య యమ బిజీగా ఉంటున్నాడు. ఆహాలో అన్‌స్టాపెబుల్‌లో అలరించిన బాలకృష్ణకు ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. దాంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలింతకీ బాలకృష్ణకు ఏమైంది..ఇదే ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు..


ఒకదానివెంట మరొకటిగా సినిమాలతో బిజీ షెడ్యూల్ కలిగి ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ సినిమా చేస్తున్నాడు. త్వరలో అనిల్ రావిపూడితో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇటీవలే.. భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న బాలకృష్ణ తాజాగా మరో సర్జరీ చేయించుకున్నారన్న వార్తే...అభిమానుల ఆందోళనకు కారణం. గత కొద్దిరోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న బాలకృష్ణకు వైద్యులు మైనర్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగ్గా ఉందని..కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్ధనలు చేస్తున్నారు.


Also read: Sarkaru vaari paata: ఈ నెల 28 విడుదల కానున్న సర్కారు వారి పాట ట్రైలర్, ఎలా ఉంటుందంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.