Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రెండు వర్గాలుగా ఉన్న చిరంజీవి, మోహన్ బాబులు ఒకే వేదిక పంచుకోనుండటంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కెమేరాలు ఫోకస్ చేసే పనిలో నిమగ్నం కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు సినీ పరిశ్రమలో గత కొద్దికాలంగా రెండు వర్గాల మధ్య దాదాపు ప్రఛ్ఛన్నయుద్ధం నెలకొంది. మా ఎన్నికల్నించి పతాక స్థాయికి చేరిన వివాదం సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వంతో చర్చల వరకూ కొనసాగింది. రెండు వర్గాల టాలీవుడ్ పెద్దల మధ్య, అభిమానుల మధ్య ట్రోలింగ్ అధికమైపోయింది. మా ఎన్నికల్లో అయితే ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకునే స్థాయికి వెళ్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చిరంజీవి సమక్షంలో సినీ పెద్దలు భేటీ అయినప్పటి నుంచి పరిస్థితి మరీ ముదిరింది. ఇదంతా మొన్న విడుదలైన మోహన్ బాబు సినిమా సన్ ఆఫ్ ఇండియాపై భారీగానే పడింది. పెద్దఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఈ వ్యవహారంపై మోహన్ బాబు కూడా సీరియస్ అయి...లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ సంకేతాలు పంపించారు. 


పరిస్థితి ఇంతలా ఉన్న తరుణంలో..ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఉత్కంఠ కల్గించే సమావేశం జరగనుంది. కల్చరల్ సెంటర్ వేదికగా జరగనున్న సమావేశానికి మోహన్ బాబు, చిరంజీవిలు హాజరుకానున్నారు. అందుకే ఈ సమావేశానికి ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో టాలీవుడ్‌లోని 24 క్రాఫ్టులకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. కరోనా సంక్షోభ సమయంలో తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులు, రెండు తెలుగు రాష్ట్రాల జీవోలు, సినీ కార్మికుల సంక్షేమం వంటి కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశానికి ఫిలిం ఛాంబర్‌లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్, స్టూడియో సెక్టార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫిలిం ఫెడరేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్ వంటి అన్ని సంఘాల్ని ఆహ్వానించారు. సినీ పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయిన నేపధ్యంలో జరుగుతున్న సమావేశం కావడంతో అందరిలో ఆసక్తి  నెలకొంది.


వాస్తవానికి ఈ సమావేశం గతంలోనే జరగాల్సింది. వివిధ కారణాలతో రెండుసార్లు వాయిదా పడింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో చిరంజీవి జరిపిన సమావేశం విజయవంతం కావడంతో ఇవాళ్టి సమావేశానికి ప్రాముఖ్యత ఏర్పడింది. సమావేశంలో రెండు వర్గాలు ఆధిపత్యపోరు కొనసాగిస్తాయా లేదా న్యూట్రల్‌గా ఉంటూ సినీ పరిశ్రమ గౌరవాన్ని కాపాడుతాయా అనేది చూడాలి. 


Also read: Thalapathy Vijay apology: వారికి చేతులు జోడించి క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో విజయ్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook