Mithunam Writer Sri Ramana Passed away: టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.  మిథునం కథా రచయిత శ్రీరమణ (70) ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన (Sri Ramana) బుధవారం తెల్లవారుజాము 5 గంటలకు తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. శ్రీరమణ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీరమణ ఎన్నో తెలుగు చిత్రాలకు కథా రచయతిగా వ్యవహారించారు. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత కాలమిస్టుగా, కథా రచయితగా మారారు. ఈయన బాపు-రమణలతో కూడా కలిసి పనిచేశారు. ముఖ్యంగా ఈయన పేరడీ రచనలకు ప్రసిద్ధి. గతంలో శ్రీరమణ నవ్య వారపత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. గుంటూరు జిల్లా వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారంలో 1952, సెప్టెంబరు 21న శ్రీరమణ పనిచేశారు. 


Also Read: Anurag Thakur: 'బెస్ట్ వెబ్‌ సిరీస్‌లకు ఇకపై ఏటా అవార్డులు': అనురాగ్ ఠాకూర్‌


తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించిన 'మిథునం' (Mithunam) సినిమాకు కథ అందించింది ఈయనే. ఆ సినిమా రచయితగా శ్రీ రమణకు ఎంతో మంచి పేరు తెచ్చింది.  2012లో విడుదలైన సూపర్ హిట్ సాధించింది. అంతేకాకుడా ఇది అస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయింది. కాగా ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.


Also Read: Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో... 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అంటున్న నాగార్జున..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook