Top Heroine: ఏ ఇండస్ట్రీ చూసినా ఏ మున్నది గర్వకారణం అన్నట్టు.. ప్రతి ఒక్క రంగంలో మహిళలు బాధితులు నిలవడం చూస్తూనే ఉన్నాము. కౌస్టింగ్ కౌచ్ అంటూ ఆ మధ్య హీరోయిన్స్ తమకు జరిగిన అన్యాయలపై గళ్లమెత్తిన సంగతి తెలిసిందే. ప్రతి రంగంలో ఇది ఆడవాళ్లను వేధించడం కామన్‌గానే ఉన్నా గ్లామర్ ఇండస్ట్రీ అయినా సినీ రంగంలో ఇది ఒకింత ఎక్కువగా ఫోకస్ అవుతూనే ఉంటుంది. ఇక కపూర్ ఫ్యామిలీ నుంచి తొలిసారి హీరోయిన్‌గా అడుగుపెట్టిన కరిష్మ కపూర్ కూడా తనకు సినీ ఇండస్ట్రీ నుంచి కాకుండా.. తన భర్త నుంచే వేధింపులను ఎదుర్కొన్న సందర్భాలను ప్రస్తావించారు. డి.రామానాయుడు తెరకెక్కించిన 'ప్రేమ ఖైదీ' హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టిన కరిష్మా కపూర్.. ఆ తర్వాత బీ టౌన్ టాప్ హీరోయిన్‌గా సత్తా చాటింది. ఇక హీరోయిన్‌గా మంచి స్టేజ్‌లోనే ఉండగానే.. సంజయ్ కపూర్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొన్నేళ్ల వరకు అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత విడాకులు తీసుకుంది. అలా తన భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి గల కారణాలను ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. అప్పట్లో నా భర్త తనను వేలం వేసిన విషయాన్ని చెప్పి సంచలనం రేపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎవరు ఎక్కువ డబ్బులు ఆఫర్ చేస్తే వారితో నేను ఒక రాత్రి మొత్తం అతనితో గడపాలని చెప్పాడు. ఇలాంటి నీచమైన పనులు చేయడానికి నేను ఒప్పుకోలేదు. ఆ తర్వాత అతని బిహేవియర్ తెలిసి అతనికి డైవోర్స్ ఇచ్చేసాను. అంతేకాదు తనతో పెళ్లి తర్వాత కూడా తన మొదటి భార్యతో ఎఫైర్ కొనసాగించిన విషయాన్ని ప్రస్తావించారు. అతని వేధింపులు తట్టుకోలేకపోయాను. అందుకే విడాకులు ఇచ్చేసాను. 2003లో పెళ్లి చేసుకున్న ఈమె కొన్నాళ్లు విడిగా ఉన్నారు. ఆ తర్వాత 2016లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లున్నారు. 


కరిష్మా కపూర్ విషయానికొస్తే.. బాలీవుడ్ షో మ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కపూర్ మనవరాలు. రాజ్ కపూర్ పెద్ద కుమారడైన రణధీర్ కపూర్ మొదటి కుమార్తెనే కరిష్మా కపూర్. తాత మరణం తరవాత సినీ రంగంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి టాప్ రేంజ్‌కు దూసుకుపోయింది. ముఖ్యంగా 90లలో ఈమె నటించిన ప్రేమఖైదీ, అనారి, జిగర్, రాజాబాబు, కూలీ నెంబర్ 1, సాజన్ చలే ససురాల్, జీత్, రాజా హిందూస్థానీ, దిల్ తో పాగల్ హై, జుడ్వా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఈమె ఖాతాలో ఉన్నాయి. కరిష్మా కపూర్ తర్వాత ఈమె చెల్లెలు కరీనా కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అక్క మించిన చెల్లిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక బాలీవుడ్‌లో యానిమల్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న రణ్‌బీర్ కపూర్.. ఈమెకు  స్వయానా బాబాయి కుమారుడు. తమ్ముడు అవుతాడు. 
Also read: Ujjwala Yojana Free Gas Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్..ఉచితంగా 75 లక్షల వంట గ్యాస్ సిలిండర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter