HBD Aadi Sai Kumar ఆది సాయికుమార్ బర్త్ డే స్పెషల్‌గా నేడు టాప్ గేర్ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. ఇందులో సాయి కుమార్ గన్ను పట్టుకుని స్టైలీష్‌గా కనిపించాడు. సీరియస్ లుక్కులో ఉన్న ఆది పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది వరకే టాప్ గేర్ నుంచి వచ్చిన అప్డేట్లన్నీ కూడా సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. అయితే ఇప్పుడు బర్త్ డే స్పెషల్ అంటూ వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆది సాయికుమార్ ఇప్పటికే ఈ ఏడాదిలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో వంటి సినిమాలతో ఆడియెన్స్‌ను అలరించే ప్రయత్నం చేశాడు. ఇక ఇప్పుడు మూడో సారి టాప్ గేర్ అంటూ వస్తున్నాడు. ఏడాది చివర్లో రాబోతోన్న ఈ సినిమాను కేవీ శ్రీధర్ రెడ్డి శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్  బ్యానర్‌పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో భారీ బడ్జెట్‌తో నిర్మించాడు.


రవితేజ రిలీజ్ చేసిన ట్రైలర్, డైరెక్టర్ మారుతి రిలీజ్ చేసిన టీజర్‌లకు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ఇక సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ను పెంచేందుకు సిద్దమైంది చిత్రయూనిట్. ఈ సారి ఆది టాప్ గేర్ అంటూ మాస్ హిట్టును కొట్టేలా కనిపిస్తున్నాడు. ఇందులో ఆది ట్యాక్సీ డ్రైవర్‌గా నటించిన విషయం తెలిసిందే. ఇందులో చేజింగ్, యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ కానున్నాయని టీజర్, ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది.


Also Read : Laththi Day 1 Collections : విరిగిన విశాల్ 'లాఠీ'.. ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే?


Also Read : Manchu Family Pays Tribute to Kaikala : కైకాల మరణం.. ప్రశాంత్ నీల్ సంతాపం.. మంచు ఫ్యామిలీ ట్వీట్లు వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook