Trisha Home Tour: తల్లిదండ్రులు ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన వారు అయినా.. ప్రముఖ సౌత్ నటుడు భానుచందర్ పుట్టి పెరిగింది మాత్రం మద్రాస్ లోనే. ఇక సౌత్ సినిమా కూడా పుట్టింది మద్రాస్ లోనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు భాషతో సంబంధం లేకుండా షూటింగులు అన్నీ మద్రాస్ లోనే జరిగేవి. ఆ తరువాత భాషకి తగ్గట్టు తమ ఇండస్ట్రీలను తమ రాష్ట్రాల్లో ఏర్పరచుకున్నారు సినీ పెద్దలు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మద్రాస్ నుంచి ఇండస్ట్రీ కొన్ని భాగాలుగా విడిపోయి ఉండచ్చు కానీ.. ఇప్పటికీ కొందరు తమిళ్ నటులు తెలుగువారి మనసుల్లో.. చెరగని ముద్రను వేసుకున్నారు. అందులో భానుచందర్ కూడా ఒకరు. యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న భానుచందర్ మంచి మనుషులు, నిరీక్షణ, సింధూరం వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు. భానుచందర్ కి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రెండు సినిమాలలో నటించారు. చిన్న కుమారుడు వైద్యుడిగా సెటిల్ అయ్యారు. ఆయన ప్రస్తుతం చెన్నైలో తన సొంత ఇంట్లో ఉంటున్నారు భానుచందర్. 


అయితే భానుచందర్ చేతుల్లోకి రాక ముందు వరకు.. ఆ ఇల్లు ఒక స్టార్ హీరోయిన్ చేతుల్లో ఉండేదట. ఆమె మరెవరో కాదు త్రిష కృష్ణన్. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని.. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్న త్రిష.. తన ఇంటిని భానుచందర్ కి విక్రయించారట. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తను సంపాదించిన డబ్బులతో.. ఎంతో ఇష్టపడి ఆ ఇంటిని కొనుక్కున్న త్రిష.. ఆ ఇంట్లో ఎక్కువ కాలం నివసించలేదు. తరువాత వేరే ఇంటికి మారే క్రమంలో.. ఆ ఇంటిని త్రిష భానుచందర్ కి అమ్మేశారు. 


ఇప్పుడు భానుచందర్ ఆ ఇంటిని తనదైన శైలిలో డెకరేట్ చేశారు. ఇంట్లోకి అడుగుపెట్టగానే ఒక మినీ బార్ కనిపిస్తుంది. అయితే భానుచందర్ మందు మానేసి 20 సంవత్సరాలు అయిందట. అయినా కూడా డెకరేషన్ గా బాగుంటుంది అనే ఉద్దేశంతో.. హాల్లో మినీ బార్ ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇంటి చుట్టూ ఉన్న పచ్చదనం క్రెడిట్ మొత్తం.. తన భార్యకే చెందుతుంది అంటారు భానుచందర్. అంతేకాకుండా ఎప్పుడైనా త్రిష కనిపిస్తే తన ఇల్లు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది అని అన్నారు. 


చాలాకాలంగా సినిమాలకి దూరంగా ఉంటున్నా భానుచందర్.. ఖాళీ సమయాల్లో సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారట. కీబోర్డు ప్లే చేయడం గిటార్ వాయించడం కూడా.. తనకి చాలా ఇష్టం అని అన్నారు భానుచందర్.


 



Also Read: AP Floods: 'డబ్బులు ఊరికే రావు' యజమాని ఏపీ వరదలకు భారీ విరాళం


Also Read: Aarti Ravi: జయం రవి విడాకుల్లో బిగ్‌ ట్విస్ట్‌.. కలిసి ఉంటానని బాంబు పేల్చిన భార్య ఆర్తి రవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.