Trisha Special Pooja on Maha shivaratri 2023 మహా శివరాత్రి సందర్భంగా నిన్న శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివుడిని దర్శించుకునేందుకు భక్తులంతా కదిలి వచ్చారు. అయితే సెలెబ్రిటీలంతా కూడా సద్గురు ఈషా ఫౌండేషన్‌కు వెళ్లి జాగరణ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. కానీ త్రిష మాత్రం వారందరికీ భిన్నంగా ఓ చిన్న గుడికి వెళ్లి తన భక్తిని చాటుకుంది. రామ్ చరణ్‌ సైతం ఇలానే తన భక్తిని సింపుల్‌గా చాటుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామ్ చరణ్ ప్రతీ ఏడాది దోమకొండలో శివాలయంకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. గతంలో ఓ సారి శివలింగానికి అభిషేకం చేస్తూ ప్రత్యేక పూజలు చేశాడు. ఆ వీడియో ప్రతీ ఏడాది శివరాత్రి నాడు వైరల్ అవుతుంటుంది. ఈ ఏడాది కూడా దోమకొండలోని శివాలయంలో రామ్ చరణ్‌ ప్రత్యేక పూజలు చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ మేరకు రామ్ చరణ్‌ ఫోటోను ఉపాసన షేర్ చేసింది.


ఇక రామ్ చరణ్ లోకల్‌లో ఉంటే.. త్రిష మాత్రం ఎక్కడికో వెళ్లినట్టుగా కనిపిస్తోంది. త్రిష సైతం శివుడికి అన్ని రకాల అభిషేకాలు చేసింది. త్రిష ఎలాంటి హడావిడి లేకుండా అలా సింపుల్‌గా కనిపించింది. శివభక్తిలో తేలిపోయింది. త్రిష ఇప్పుడు కోలీవుడ్‌లో టాప్ ప్లేస్‌లో ఉందన్న సంగతి తెలిసిందే.


 



త్రిషను ఇప్పుడు టాలీవుడ్‌ అంతగా పట్టించుకోవడం లేదు. 96 సినిమాతో త్రిషకు అక్కడ మళ్లీ కెరీర్‌ తిరిగి ఊపందుకుంది. అయితే మళ్లీ ఆ రేంజ్‌ హిట్ ఒక్కటి కూడా రాలేదు. తెలుగులోనూ వచ్చిన ఆఫర్లు కూడా చేజారిపోయాయి. మామూలుగా అయితే ఆచార్య సినిమాలో త్రిష నటించాలి. కానీ పొన్నియిన్ సెల్వన్ కోసం ఆచార్యను వదులుకుందని చిరంజీవి చెప్పాడు. కానీ త్రిష వర్షన్ వేరేలా ఉంది.


ఏది ఏమైనా కూడా పొన్నియిన్ సెల్వన్‌తో మళ్లీ గ్లామర్ క్వీన్‌గా త్రిష తన సత్తాను చాటింది. ఈ సినిమాలో త్రిష స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. రెండో పార్ట్ కూడా విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇందులో త్రిష పాత్ర ఇంకెంత పవర్ ఫుల్‌గా ఉంటుందో చూడాలి.


Also Read:  Taraka Ratna Death Live Updates: 'మోకిల' నివాసానికి చేరుకున్న తారకరత్న భౌతికకాయం..భోరున విలపిస్తున్న నందమూరి కుటుంబం


Also Read: Taraka Ratna Siva Devotee: శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యం.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook