Trisha Leg Injury News in Telugu: సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆమె తెరకు పరిచయమై 20 ఏళ్లు గడుస్తున్నా ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. మధ్య మధ్యలో సినిమా అవకాశాలు తగ్గుతున్నా సరే ఆమె మాత్రం చేస్తున్న అన్ని సినిమాలతో కంబ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎట్టకేలకు ఆమె ఇటీవల పొన్నియన్ సెల్వన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాల కుందవై అనే ఒక పాత్రలో నటించి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే గాక ఈ సినిమా విడుదలయిన అన్ని బాషల ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. అయితే త్రిష తన అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆమె తన కాలికి ఫ్రాక్చర్ అయినట్లుగా ఒక ఫోటోని తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది పొన్నియన్ సెల్వన్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆమె ఇటీవల ఫారెన్ వెకేషన్ కి వెళ్ళింది. ఆ ఫారెన్ వెకేషన్ లో ఒక చోట ఆమె పడిపోవడంతో ఆమె కాలికి ఫ్రాక్చర్ అయినట్లుగా తెలుస్తోంది.


దీంతో వెంటనే ట్రిప్ ముగించుకుని వెనక్కి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఒకపక్క కాలి ఫ్రాక్చర్ తో బాధపడుతున్నా సరే ఆమె తాజాగా జరిగిన పొన్నియన్ సెల్వన్ సక్సెస్ పార్టీలో మాత్రం కనువిందు చేసింది. సినిమా యూనిట్ అంతా కలిసి చేసుకుంటున్న ఈ సక్సెస్ పార్టీ తన కాలి ఫ్రాక్చర్ వల్ల ఏమాత్రం ఇబ్బంది పడకూడదని ఆమె భావిస్తూ కాలి నొప్పిని భరిస్తూనే సక్సెస్ పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది.


ఇక తాజాగా త్రిష సక్సెస్ పార్టీకి హాజరైన ఫోటోలు అలాగే ఆమె తన కాలి ఫ్రాక్చర్ ఫోటోలను షేర్ చేయగా అవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పొన్నియన్ సెల్వన్ 2 లో కూడా త్రిష కుందవై పాత్రలో అలదించబోతోంది. పొన్నియన్ సెల్వన్ 1 సినిమా సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద కూడా భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి చూడాలి రెండో భాగం ఎలా ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది అనేది.


Also Read: NTR – Koratala Film: హమ్మయ్య.. పని మొదలైంది.. గుండెదడ తగ్గిందంటున్న ఎన్టీఆర్ ఫాన్స్!


Also Read: Nithin- Chiranjeevi: 'భీష్మ' స్నేహాన్ని కాదనుకోలేక..చిరు కాదన్న కథతో రిస్క్ చేస్తున్న నితిన్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook