NTR – Koratala Film: హమ్మయ్య.. పని మొదలైంది.. గుండెదడ తగ్గిందంటున్న ఎన్టీఆర్ ఫాన్స్!

NTR – Koratala Film Update: ఎన్టీఆర్ -కొరటాల శివ సినిమాకు సంబంధించి ఎట్టకేలకు ఒక అప్డేట్ బయటకు వచ్చింది. డీఓపీ రత్నవేలు, సబు సిరిల్ తో కొరటాల చర్చిస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 6, 2022, 02:40 PM IST
NTR – Koratala Film: హమ్మయ్య.. పని మొదలైంది.. గుండెదడ తగ్గిందంటున్న ఎన్టీఆర్ ఫాన్స్!

NTR – Koratala Film pre production in full swing: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద నిన్న మొన్నటి వరకు సందిగ్ధం నెలకొంది. వాస్తవానికి ముందుగా ఆయన త్రివిక్రమ్ తో ఆయన సినిమా చేస్తాడని అనుకున్నారు కానీ ఆ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో ఆయన కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.

అయితే కొరటాల శివ ఎన్నోసార్లు కథలో మార్పులు చేర్పులు సూచించినా అవి ఎన్టీఆర్ కు నచ్చకపోవడంతో ఇక ఆ సినిమా ఆగిపోవచ్చు అనే ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో అది నిజం కాదని సినిమాకు సంబంధించి డిఓపి రత్న వేలు, ప్రొడక్షన్ డిజైనర్ సబు సిరిల్ ఇద్దరితో కలిసి కొరటాల శివ సినిమాకు సంబంధించిన చర్చలు పెద్ద ఎత్తున జరుపుతున్నారని ప్రచారం జరిగింది.

అయితే ఎట్టకేలకు అదే నిజమైంది వీరిద్దరితో కలిసి కొరటాల శివ చర్చలు జరుపుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరూ నటిస్తారనే విషయం మీద సరైన క్లారిటీ లేదు కానీ ఈ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్ ఆర్ట్స్, కొరటాల శివ స్నేహితులు మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇక ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక ఎన్టీఆర్ సినిమాకి రత్నవేలు డిఓపిగా పనిచేయడం అలాగే బాహుబలి వంటి సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన సబు సిరిల్ పని చేస్తూ ఉండడం సినిమా మీద మరింత హైప్ పెంచుతోంది. సబు సిరిల్ లాంటి ప్రొడక్షన్ డిజైనర్ ను సినిమా కోసం రంగంలోకి దించారంటే సినిమా ఒక రేంజ్ లో ఉంటుందని అభిమానులైతే అంచనాలు పెట్టుకుంటున్నారు. మరి సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు చేస్తారో చూడాలి. Also Read: Director Teja - Suman Shetty: కృతజ్ఞత అంటే ఇది.. ఏకంగా రూమ్ సిద్ధం చేశాడట.. ఆసక్తికర విషయం బయట పెట్టిన తేజ

Also Read: Teja on Uday Kiran: చేయాల్సిందంతా చేసి కాళ్లు పట్టుకోవడానికి వచ్చాడు.. క్షమించనని చెప్పా!

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x