Actress Trisha turning point: త్రిష జీవితాన్నే మార్చిన రోజు
Actress Trisha`s life turning point: స్టార్ హీరోయిన్ త్రిష తన నటనతో తెలుగు, తమిళంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. గత రెండు దశాబ్ధాల పాటు తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో త్రిష కూడా ఒకరు. తన జీవితంలో సెప్టెంబర్ 30 అనేది ఒక మరచిపోలేని రోజు అని త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
Actress Trisha's life turning point: స్టార్ హీరోయిన్ త్రిష తన నటనతో తెలుగు, తమిళంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. గత రెండు దశాబ్ధాల పాటు తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో బిజీగా ఉన్న హీరోయిన్స్‌లో త్రిష ( Trisha ) కూడా ఒకరు. తన జీవితంలో సెప్టెంబర్ 30 అనేది ఒక మరచిపోలేని రోజు అని త్రిష తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. 1999లో సెప్టెంబర్ 30న త్రిష కేవలం 16 ఏళ్ళ వయసులో ''మిస్ మద్రాస్ 1999' ( Miss Madras crown ) కిరీటాన్ని గెలుచుకున్నప్పటి ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, “నా జీవితాన్ని మార్చిన రోజు” అని ఆ రోజు ప్రాముఖ్యతను తెలిపింది. Also read : Mumbai Police: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు సమన్లు
త్రిష 'మిస్ చెన్నై' అయిన తరువాత వరుస సినిమా అవకాశాలతో బిజీ అయిపోయింది. 1999లో ప్రశాంత్, సిమ్రాన్ జంటగా కలిసి నటించిన జోడి ( Jodi movie ) చిత్రంలో ఒక చిన్న పాత్రతో వెండితెరపైకి ప్రవేశించి త్రిష.. ఆ తర్వాత సూర్యతో కలిసి 2002లో విడుదలైన 'మౌనం పెసియాధే' ( Mounam pesiyadhe ) చిత్రంతో తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2003లో 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో ( Nee manasu naku telusu movie ) టాలివుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2004లో 'వర్షం' సినిమాలో ప్రభాస్‌తో ( Prabhas ) కలిసి నటించి తెలుగునాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. Also read : R Madhavan about Pushpa: 'పుష్ప'లో విలన్ పాత్రపై స్పందించిన మాధవన్
అప్పటి నుండి త్రిష, తన రెండు దశాబ్దాల కెరీర్‌లో వెనక్కి తిరిగి చూడనంతగా బిజీ అయింది. ఈ ఏడాది త్రిష 6 సినిమాలకు సైన్ చేయగా.. అందులో ఇప్పటికే రెండు సినిమాలు పూర్తి కాగా మరో నాలుగు సినిమాలు త్రిష చేతిలో ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe