Trisha Son: సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపరుస్తుండగా ఇప్పుడు త్రిష ఇంట్లో విషాదం కూడా అలుముకుంది. తన కొడుకు ఈరోజు ఉదయం చనిపోయాడని చెప్పి అందరినీ ఆశ్చర్యపరచడంతో.. ఏంటి నీకు కొడుకు ఉన్నాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకెళితే స్టార్ హీరోయిన్ త్రిష తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రిస్మస్ రోజు తెల్లవారుజామున నా కొడుకు జొర్రో చనిపోయాడు. నా గురించి బాగా తెలిసిన వాళ్లకు జొర్రో నాకు ఎంత ముఖ్యం అనేది బాగా తెలుసు. నేను,  నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాము కుదుటపడడానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది. అప్పటివరకు అందుబాటులో ఉండను అంటూ హీరోయిన్ త్రిష తన సోషల్ మీడియా ఖాతా ద్వారా చెప్పుకొచ్చింది.


ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా త్రిష తన కొడుకుగా భావించే పెంపుడు కుక్క మరణించడంతో కన్నీటి పర్యంతం అవుతుంది. అంతేకాదు ఆ కుక్కకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడమే కాకుండా అంత్యక్రియలు పూర్తి చేసిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది త్రిష. 


త్రిష విషయానికొస్తే.. దక్షిణాది భాషలలో హీరోయిన్ గా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈమె వయసు 40 సంవత్సరాలు. ఇంకా ఈ స్టార్ హీరోయిన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.  అలాగే తమిళ్లో అజిత్ విడామూయార్చి, గుడ్ బాడ్ అగ్లీ చిత్రాలలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సూర్య,  కమలహాసన్ నటించబోయే కొత్త సినిమాలలో కూడా ఈమె అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. 


ప్రస్తుతం మలయాళం లో కూడా రెండు సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.  ఏదిఏమైనా కెరియర్లో బిజీగా ఉన్నప్పటికీ పెంపుడు కుక్క చనిపోయిందని పోస్ట్ పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం త్రిష కన్నీటి పర్యంతమవుతుండడంతో.. అభిమానులు ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.


 



Also Read: Jr NTR Fan: జూనియర్‌ ఎన్టీఆర్‌పై విమర్శలపై యూటర్న్‌.. కౌశిక్‌ తల్లి వివరణ ఇదే!


 


Also Read: Dil Raju: సంధ్య థియేటర్‌ బాధిత రేవతి భర్తకు దిల్‌ రాజు బంపర్‌ ఆఫర్‌.. సినిమా ఛాన్స్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.