Truth Behind Sukumar Roping Jagapathi Babu: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 2021 సంవత్సరంలో విడుదలయి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కేవలం తెలుగు భాషలోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదలైన ఈ సినిమాకి హిందీలో అత్యద్భుతమైన రెస్పాన్స్ దక్కింది.  ఒక సాధారణ ఎర్రచందనం చెట్లు కొట్టే కూలి ఆ ఎర్రచందనం సిండికేట్ కి డాన్ గా ఎలా ఎదిగాడు అనే కథాంశంతో మొదటి భాగాన్ని తెరకెక్కించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్మిక మందన్న హీరోయిన్ గా ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ వంటి వారి కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ చేస్తామని అప్పట్లోనే ప్రకటించారు. దానికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రస్తుతానికి విశాఖలో జరుగుతోంది. అయితే ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు అయితే తెర మీదకు వస్తున్నాయి. అందులో ముఖ్యమైనది ఈ సినిమాలో విలన్ గా జగపతి బాబుని తీసుకున్నారు అనే ఒక వార్త.


ఈ వార్త అయితే రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి సినిమాలతో సుకుమార్ జగపతిబాబు మధ్య సాన్నిహిత్యం పెరిగిందని ఈ పాత్రకు జగపతిబాబు అయితేనే న్యాయం చేయగలరని భావించి పుష్ప రెండో భాగంలో జగపతిబాబుని సుకుమార్ తీసుకున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది.. అయితే పుష్ప 2 టీం చెబుతున్న దాని ప్రకారం అది నిజం కాదని తెలుస్తోంది. వారు అధికారికంగా ఖండించక పోయినా ఈ సినిమాలో జగపతిబాబుని తీసుకోలేదని, అయితే ఎలా బయటకు వచ్చిందో తెలియదు కానీ ఈ వార్త బయటకు వచ్చి వైరల్ అవుతుంది అని పుష్ప యూనిట్ చెప్పినట్లుగా మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


వాస్తవానికి పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని చాలా జాగ్రత్తగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. రెండో భాగం మీద భారీ బడ్జెట్ కూడా పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మొదటి భాగానికి తక్కువ బడ్జెట్ పెడితేనే భారీ లాభాలు వచ్చాయి, కాబట్టి రెండో భాగం మీద కాస్త బడ్జెట్ పెంచి ఇంకా లాభాలు అందుకునే అవకాశం కోసం నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిజంగా జగపతి బాబుని ఈ సినిమాలోకి తీసుకున్నారా? లేక అది నిజంగా ప్రచారం ఏనా అనే విషయం అధికారికంగా ప్రకటన చేస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ అనే సినిమాలో జగపతిబాబు విలన్ పాత్రలో నటిస్తున్నారు.  అలా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగమైన జగపతిబాబుని సుకుమార్ తీసుకుంటారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి మరి. ఒకవేళ తీసుకుంటే మాత్రం సినిమాకి ఆయన అదనపు ఆకర్షణ అవుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదనే చెప్పాలి.
Also Read: Akhanda Hindi: 'పఠాన్'ను టార్గెట్ చేయడానికే అఖండను ఇప్పుడు రిలీజ్ చేశారా?


Also Read: Dil Raju Sankranthi Race: మరోసారి సంక్రాంతి రేసుకు సిద్దమవుతున్న దిల్ రాజు.. ఈసారి కూడా 'మైత్రీ'తోనే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook