Akhanda Hindi: 'పఠాన్'ను టార్గెట్ చేయడానికే అఖండను ఇప్పుడు రిలీజ్ చేశారా?

Akhanda Released: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా 2021 చివర్లో విడుదలై సూపర్ హిట్ గా నిలివగా ఇప్పుడు దాన్ని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 20, 2023, 07:22 PM IST
Akhanda Hindi: 'పఠాన్'ను టార్గెట్ చేయడానికే అఖండను ఇప్పుడు రిలీజ్ చేశారా?

Akhanda Released to Counter to Pathaan: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా 2021 చివర్లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో తెలుగులోనే మంచి కలెక్షన్లు రాబట్టి నార్త్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అప్పట్లోనే ఈ సినిమాని హిందీలో విడుదల చేస్తారని ఎందురో అనుకున్నారు కానీ ఎందుకో ఆ విషయం మీద హిందీ హక్కులు కొనుక్కున్న వారు సైలెంట్ అయ్యారు.

ఈ సినిమాని ప్రస్తుతం చత్రపతి సినిమా నిర్మిస్తున్న పెన్ మూవీస్ అధినేత జయంతి లాల్ గడ అప్పట్లో కొనుగోలు చేశారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈరోజు జనవరి 20వ తేదీన ఈ సినిమాని హిందీలో పెద్ద ఎత్తున విడుదల చేశారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పివిఆర్ సినిమాస్ ప్రకటించిన ఆఫర్తో చాలా చోట్ల పివిఆర్ థియేటర్లలో ఈ సినిమాని 99 రూపాయలకే చూసే అవకాశం కూడా కల్పించారు.

అయితే ఇంత కాలం తర్వాత అఖండ సినిమాని రిలీజ్ చేయడానికి వేరే కారణం ఉందనే టాక్ వినిపిస్తోంది. అదేమిటంటే షారుక్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమా జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలవుతోంది. తెలుగు సహా తమిళ హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకి కౌంటర్ గా ఈ అఖండ సినిమా రిలీజ్ చేశారనే వాదన వినిపిస్తోంది.

పఠాన్ సినిమా ఏ మతానికి చెందిన సినిమా కాకపోయినా సరే పటాన్ అనే పేరును ఎక్కువగా ముస్లిం మతస్తులు ఉపయోగిస్తూ ఉంటారు. దానికి కౌంటర్ గానే అఖండని ఒక హిందుత్వ కథతో రూపొందించిన సినిమాని రిలీజ్ చేస్తున్నారని అంటున్నారు.

ఇందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఇదే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా 2021లో విడుదలై బాలకృష్ణ కెరియర్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ విలన్ గా నటించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.
Also Read: VSR vs WV Collections: వీర సింహా రెడ్డిని దారుణంగా వెనక్కు నెట్టేసిన వాల్తేరు వీరయ్య.. ఎంత తేడానో తెలుసా?

Also Read: Waltair Veerayya Collections: 100 కోట్లకు చేరువలో వాల్తేరు వీరయ్య.. ఇంకా ఎంత వసూలు చేయాలంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News