Truth Behind Vani Jayaram Death: సుమారు 19 భారతీయ భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడిన వాణి జయరాం, అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలో నుంగంబాక్కం అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో నివసించే ఆమె ముందుగా అనారోగ్య కారణాలతో కన్నుమూశారని అనుకున్నారు. కానీ ఆమె నుదుటి మీద గాయాలు ఉండడంతో ఏదో జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఆమె మీద ఎవరో కావాలని దాడి చేసినట్లుగా ఉందనే ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకోవడమే కాక పోస్టుమార్టం కూడా చేయించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే వాణీ జయరాం మరణానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ది స్లేట్ స్కూల్స్ నిర్వహిస్తున్న అమర్నాథ్ వాసిరెడ్డి తన ఫేస్బుక్ ద్వారా ఒక కీలక విషయాన్ని వెల్లడించారు. అదేమంటే వాణీ జయరాం మృతి గురించి తన స్నేహితుడు దక్షిణామూర్తి కొంత సమాచారం అందించారని ఆయన పేర్కొన్నారు. దక్షిణామూర్తి తమిళ సినిమా పరిశ్రమలో ఒక మ్యూజిక్ కంపోజర్ అని ఆయన చెప్పిన వివరాలు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని వాసిరెడ్డి అమర్నాథ్ పేర్కొన్నారు. అసలు విషయం ఏమిటంటే వాణీ జయరాం ఇంట్లో ఒంటరిగా ఉంటారని పనిమనిషి వచ్చి పని చేసి వెళ్ళిపోతుందని చెప్పుకొచ్చారు.


వాణి జయరాం సోదరి కొంత దూరంలో మరో ఫ్లాట్లో నివసిస్తారని పేర్కొన్నారు. అయితే వాణిజయరాం బాత్రూం కి వెళ్లి అక్కడ కింద పడ్డారని తలకు గాయం అయిందని సహాయం చేయడానికి ఎవరూ లేరు కాబట్టి ఆమె ఒంటరిగా ప్రాణాలు వదిలారని అమర్నాథ్ వాసిరెడ్డి పేర్కొన్నారు. అయితే ఆమె నివాసం దగ్గరలోనే దక్షిణామూర్తి తన గ్రూప్ తో కలిసి రికార్డింగ్ చేయిస్తున్నారని, దక్షిణామూర్తికి తెలిసిన ఒక వ్యక్తి ఆమెను ఫంక్షన్కు పిలవడానికి అప్పుడే ఇంటికి వెళ్ళాడని పేర్కొన్నారు.


బెల్ కొడితే ఎంతకీ తలుపు తెరుచుకోలేదు చాలాసేపు బెల్ కొట్టినా లాభం లేదని దగ్గరలో ఉన్న వాణీ జయరాం సోదరికి కాల్ చేశారట. సమాచారం అందుకున్న వెంటనే దక్షిణామూర్తి కూడా ఆమె నివాసానికి వెళ్లారని ఈలోపు పోలీసులకు పనిమనిషి సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి తలుపు పగలగొట్టారని పేర్కొన్నారు. తర్వాత వాణిజయరాం మృత దేహాన్ని బెడ్ షీట్లో చుట్టి రక్తం కారుతుంటే బయటకు తెచ్చారని, వాసిరెడ్డి పేర్కొన్నారు. విధి చేయు వింతలన్నీ మతిలేని చేష్టలే శ్రద్ధాంజలి అమ్మ అంటూ అమర్నాథ్ వాసిరెడ్డి ఎమోషనల్ అవుతూ పోస్టు చేశారు. 
Also Read: Vani jayaram Postmortem: వాణి జయరాం పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు..


Also Read: Jr NTR Serious: ఇరికించిన సుమ, సీరియస్ అయిన ఎన్టీఆర్.. ఇంతకు ముందెన్నడూ ఇలా చూసి ఉండరు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.