Sheezan Khans deleted chats recovered reveals shocking details: తునీషా శర్మ ఆత్మహత్య తర్వాత అందరూ షాక్‌లోనే ఉన్నారు. ఆమె మరణానికి షీజన్ కారణమంటూ తునీషా తల్లి ఆరోపించింది. ఘటన జరిగిన రోజునే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ఇక అప్పటి నుంచి పోలీసులు షీజన్‌ను విచారిస్తున్నారు. ఈ రోజు పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరిచారు, అక్కడ కోర్టు షీజన్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తునీషా శర్మ ఆత్మహత్య తర్వాత, ఆమె సహ నటుడు షీజన్ ఖాన్ కు రోజురోజూకూ సమస్యలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ విషయంలో చాలా విషయాలు వెల్లడయ్యాయి. అంతకుముందు రోజు, తునీషా తల్లి షీజన్ తన మతం మారాలని ఒత్తిడి తెచ్చాడని ఆరోపించింది. అంతే కాకుండా తునీషాపై షీజన్ దాడి చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఇక మరోపక్క డిలీట్ చేసిన షీజన్ ఖాన్ వాట్సాప్ చాట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


షీజన్ ఖాన్ ఆమె నుంచి విడిపోయినప్పటి నుండి తునీషా శర్మను చాలా విస్మరిస్తున్నాడని, ఆమె మెసేజ్ లకు రిప్లై కూడా ఇవ్వడం లేదని గుర్తించారు. షీజన్ ఖాన్ చాలా మంది అమ్మాయిలతో కాంటాక్ట్‌లో ఉన్నట్లు రికవరీ చేసిన చాట్‌ల ద్వారా వెల్లడైందని అంటున్నారు. ఇక షీజన్ తునీషాను హిజాబ్ ధరించమని బలవంతం చేయడమే కాకుండా ఉర్దూ నేర్చుకోమని బలవంతం చేసేవాడని పోలీసులు తెలిపారు, ఇక షీజన్ ఖాన్ తునీషాను చెంపదెబ్బ కొట్టినట్లు తునీషా శర్మ తల్లి ఆరోపించింది.


డిసెంబర్ 24న షూటింగ్ సెట్‌లోనే తునీషాను షీజన్ చెప్పుతో కొట్టాడని తునీషా తల్లి ఆరోపించింది. ఇక ముంబై పోలీసులు షీజన్ ఖాన్ వాట్సాప్ చాట్‌లను పరిశీలించి షీజన్ సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ కూడా టీవీ సీరియల్ యాక్టర్ అని, ఆమె ముంబైలో నివసిస్తుందని గుర్తించారు. అంతే కాదు తునీషా ఆత్మహత్య చేసుకున్న రోజు షీజన్ తన రహస్య ప్రియురాలితో సుమారు అరగంట పాటు చాట్ చేశాడని గుర్తించారు. 


Also Read: Andrea Jeremiah Hot: కోటు విప్పేసి ఎద అందాల ఆరబోతతో రెచ్చిపోయిన ఆండ్రియా


Also Read: VK Naresh-Pavitra Marriage: పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నా.. ఆమెకు లిప్ లాక్ ఇస్తూ నరేష్ ప్రకటన!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook