VK Naresh-Pavitra Marriage: పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నా.. ఆమెకు లిప్ లాక్ ఇస్తూ నరేష్ ప్రకటన!

VK Naresh-Pavitra Marriage:  తన సహనటి పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నా అంటూ ఆమెకు లిప్ లాక్ ఇస్తూ నటుడు నరేష్ ఒక వీడియో విడుదల చేశారు, ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేయడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 31, 2022, 12:01 PM IST
VK Naresh-Pavitra Marriage: పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నా.. ఆమెకు లిప్ లాక్ ఇస్తూ నరేష్ ప్రకటన!

Actor VK Naresh Announced He's Going to Marry Pavitra Lokesh Soon: చాలాకాలం నుంచి జరుగుతున్న ప్రచారమే ఎట్టకేలకు నిజమైంది. ఎట్టకేలకు విజయనిర్మల కుమారుడు, హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వ్యవహరిస్తున్న నరేష్ తన సహచర నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటిస్తున్న పవిత్రను వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నిజానికి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని గత ఏడాది కాలంగా అనేక రకాల వార్తలు తెరమీదకు వచ్చాయి.

అయితే తాము స్నేహితులం మాత్రమే అని చెప్పుకోవడానికి వారు ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వీరిద్దరిని మైసూరులో ఒకే గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత వీరు పబ్లిక్ లో కనిపించడం తగ్గించారు. అయితే కృష్ణ అంత్యక్రియల సమయంలో కూడా రమ్య రఘుపతి ఒకచోట కూర్చుని ఉండగానే నరేష్, పవిత్ర కలిసి తిరుగుతూ కనిపించడం కూడా అనేకమంది దృష్టిని ఆకర్షించింది.

అయితే ఈ విషయం మీద నరేష్ పవిత్ర కలిసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తమ గురించి అసభ్యకరమైన రాతలు రాస్తున్నారని పలు మీడియా ఛానల్స్ మీద, యూట్యూబ్ ఛానల్స్ మీద, వెబ్సైట్స్ మీద కూడా వారు ఫిర్యాదు చేశారు. అయితే ఎట్టకేలకు 2023 నూతన ఏడాదిలో అడుగుపెడుతున్న సందర్భంగా తమ జీవితంలో కొత్త ఇన్నింగ్స్ బిగిన్ అవుతున్నాయి అంటూ వీకే నరేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక వీడియో విడుదల చేశారు.

ఇక ఈ వీడియోలో నరేష్, పవిత్ర కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోవడమే కాక ఇద్దరు కూడా లిప్ కిస్ పెట్టుకుంటున్నట్టు వీడియో తీసి విడుదల చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ఈ జంట ఇప్పుడు అధికారికంగా ప్రకటించినట్లు అయింది.

అయితే రమ్య రఘుపతితో విడాకుల వ్యవహారం పూర్తి అయిన వెంటనే వీరు వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. నరేష్ ఇప్పటికే ముగ్గురిని వివాహం చేసుకోగా ముగ్గురితో కూడా విడాకులు వరకు వ్యవహారం వచ్చింది. ఇప్పుడు ఆయన పవిత్ర లోకేష్ తో ఏడు అడుగులు వేయబోతున్నారు. ఇక పవిత్ర లోకేష్ కు గతంలోనే కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్తో వివాహం జరగగా ఆమెకు ఆయనతో ఇద్దరు సంతానం కలిగారు, వారు ఇప్పుడు తండ్రి సంరక్షణలోనే పెరుగుతున్నారు.

Also Read: USA Pre Sales : వాల్తేరు వీరయ్యపై డామినేషన్ మొదలెట్టిన వీరసింహా రెడ్డి.. పండుగ చేసుకుంటున్న ఫాన్స్!

Also Read: Nayani Pavani Hot Photos: ఎర్ర చీరలో రెచ్చిపోయి అందాలు ఆరబోసిన నయని పావని.. నెవర్ బిఫోర్ హాట్ ట్రీట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News