Sheezan Khan Bail Plea Postponed For 11 January: బుల్లితెర నటి తునీషా శర్మ ఆత్మహత్యకు సంబంధించి ఆమె సహనటుడు షీజన్‌ను పోలీసులు అరెస్టు చేశారన్న సంగతి తెలిసిందే. అతన్ని కోర్టు జ్యోడీషియల్ కస్టడీకి కూడా పంపింది. ఇక ఈరోజు షీజన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను వసాయ్ కోర్టు జనవరి 11కి వాయిదా వేసింది. తదుపరి తేదీని కోరామని, జనవరి 11న కోర్టులో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామని తునీషా ఆత్మహత్య కేసులో ఆ,ఏ తరఫు న్యాయవాది తరుణ్ శర్మ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం నాడు తునీషా శర్మ తరఫు న్యాయవాది ఈ విషయంలో తన తరఫు న్యాయవాది వాదనలు వినిపించనుండగా ఆ తర్వాత కోర్టు ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తునీషా శర్మ మరణం కేసులో ఆమె సహనటుడు షీజన్ ఖాన్ గత కొన్ని రోజులుగా కస్టడీలో ఉండగా అతని పై తునీషా శర్మ కుటుంబం ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే షీజన్ ఖాన్ కు, అతని సోదరీమణులకు ఉర్దూ రాదని, షో డైరెక్టర్ సూచనల మేరకు ఉర్దూ పంక్తులను కంఠస్థం చేసేవారని షీజన్ ఖాన్ తరపు న్యాయవాది సోమవారం కోర్టుకు తెలిపారు.


అలీ బాబా: దస్తాన్-ఈ-కాబుల్ సీరియల్‌లో షీజన్ -తునీషా లీడ్ రోల్స్. ఇద్దరూ షోలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తుండగా, నిజ జీవితంలో కూడా ఇద్దరూ ఒకరికొకరు చాలా సన్నిహితులు. ఇక నివేదికల ప్రకారం, షీజన్ ఆత్మహత్య ఘటనకు 15 రోజుల ముందు తునీషాతో బ్రేకప్ చెప్ప్పాడ్. అయితే షీజన్ ఖాన్, అతని కుటుంబం తమ కుమార్తెకు ఉర్దూ నేర్పించారని, ఆమెను తమ మతం వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారని తునీషా కుటుంబం ఆరోపించింది.


షీజన్ మహ్మద్ ఖాన్ తరపు న్యాయవాది కోర్టులో ఆయన న్యాయవాది మాట్లాడుతూ ఈ కథనానికి ఉద్దేశపూర్వకంగా లవ్ జిహాద్ కోణాన్ని ఆపాదించారని  అన్నారు. మతం కారణంగానే షీజన్‌ను ఈ కేసులో అరెస్ట్ చేశారని షీజన్ ఖాన్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. మరోవైపు షీజన్ కూడా కోర్టులో 'నేను ముస్లింని కాకపోతే ఇదంతా జరిగేది కాదు' అని అన్నారు. 


Also Read: Vijaya Sai Reddy: విశాఖలో ఇల్లు కట్టుకుంటానన్న చిరంజీవి.. స్వాగతం అంటూ విజయసాయి ట్వీట్!


Also Read: Slums Caught Fire: భీకర అగ్నిప్రమాదం.. 200 ఇళ్లు దగ్ధం.. ఆర్పుతున్న కొద్దీ అలానే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook