Slums Caught Fire Due To Cylinder Blast at Gurgoan: ఢిల్లీ -హర్యానా బోర్డర్ లోని గురుగ్రామ్‌లోని ఘసౌలా గ్రామంలోని మురికివాడలో సోమవారం ఉదయం సిలిండర్ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో వందలాది కుటుంబాలకు చెందిన వారు నిరాశ్రయులు అయ్యారు. సెక్టార్ 49లోని ఘసౌలా గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో 200కు పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. ఇక ఈ క్రమంలో పలుచోట్ల సిలిండర్లు కూడా పేలాయని అలాగే పదుల సంఖ్యలో ప్రజలు కూడా గాయాలపాలయ్యారని అంటున్నారు.
ఇక ఒకపక్క తీవ్రమైన చలికి ఇబ్బంది పడుతుంటే మరోపక్క ఇళ్ళు కాలిపోయి వస్తువులన్నీ కాలిపోవడంతో ఇక్కడ నివసించే ప్రజలు అందరూ బాధ పడ్తున్నారు. సెక్టార్-49లోని ఘసౌలా గ్రామ సమీపంలోని ఖాళీ స్థలంలో నిర్మించిన మురికివాడలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి, అక్కడి మురికివాడలో ఉంచిన చిన్న గ్యాస్ సిలిండర్లలో పేలుడు కారణంగా, మంటలు వేగంగా పెరిగాయి. చాలా తక్కువ సమయంలోనే 200 గుడిసెలు దగ్ధమై వందలాది కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా, అప్పటికి 200కు పైగా గుడిసెలు బూడిదయ్యాయి. ఇక ఈ ప్రమాదంలో దాదాపు డజను మంది గాయపడగా గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులు, సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖకు చెందిన 20కి పైగా వాహనాలు సుమారు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి.
అయితే మంటలను ఆర్పే సమయంలో కూడా మురికివాడలో ఉంచిన సిలిండర్లు పేలుతూనే ఉండడంతో మంటలను అదుపు చేయడంలో అగ్నిమాపక శాఖ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇక అగ్నిప్రమాదం అనంతరం జరిగిన తొక్కిసలాటలో చిన్న పిల్లలు గాయపడ్డారని అక్కడి వారు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే వాహనాలు పంపించామని అగ్నిమాపక శాఖ అధికారి రాజేష్ శర్మ తెలిపారు. అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Also Read: Chiranjeevi Counters: కొరటాల శివపై మెగాస్టార్ ఇన్ డైరెక్ట్ కౌంటర్.. నిజంగా పెడచెవిన పెట్టారా?
Also Read: Vijaya Sai Reddy: విశాఖలో ఇల్లు కట్టుకుంటానన్న చిరంజీవి.. స్వాగతం అంటూ విజయసాయి ట్వీట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook