Malikappuram Telugu Movie Review: ఈ మధ్యకాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలను ఆదరిస్తూ వస్తున్నారు ప్రేక్షకులు. దీంతో ఇతర భాషలలో సూపర్ హిట్ గా నిలిచిన చిన్న సినిమాలను సైతం తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. గతంలో కాంతార వంటి డివోషనల్ కంటెంట్ సినిమాని తీసుకొచ్చి తెలుగులో సూపర్ హిట్ అందుకున్న గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇప్పుడు మాలికాపురం అనే సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడంతో ఈ సినిమా కూడా భారీ హిట్ అవుతుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. సమంత, యశోద సినిమాతో తెలుగు వారికి కూడా పరిచయమైన ఉన్ని ముకుందన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించడంతో ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది. దానికి తోడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువమంది తమ దేవుడిగా భావించి పూజలు చేసే అయ్యప్ప స్వామికి సంబంధించిన కథ కావడంతో సినిమా ఎలా ఉంటుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం.


కధ ఏమిటంటే:


కేరళలోని ఒక చిన్న గ్రామంలో ఈ సినిమా కథ మొదలవుతుంది షన్ను అని 8 ఏళ్ల చిన్నారికి అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం. అయ్యప్ప స్వామి దేవుడు కాదు, తన స్నేహితుడు ఒక సూపర్ హీరో అన్నట్లుగా ఆమె భావిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి గురించి నానమ్మ చెప్పే కథలు వింటూ కచ్చితంగా అయ్యప్ప స్వామిని చూడాలని భావిస్తూ ఉంటుంది. ఆమె తండ్రి ఆమెను శబరిమలకు తీసుకువెళ్తానని చెబుతూ ఉంటాడు కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తాడు. అయితే మాల ధరించి మరికొన్ని రోజులలో శబరిమల వెళదాం అనుకుని సిద్ధమైన సమయానికి అప్పుల వారి చేతిలో అవమానం కలగడంతో షన్ను తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు.


దీంతో ఆమె కుటుంబం అంతా కాకా వికలం అవుతుంది. వీరి కుటుంబంతో పాటు పక్కనే కలిసి నివసించే మరో బాబుని తీసుకుని తండ్రి లేకపోయినా శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లాలని భావించి ఇంట్లో చెప్పకుండా బయలుదేరి వెళుతుంది షన్ను . అయితే చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయి అమ్ముకునే ఒక ముఠాలోని సభ్యుడు షన్నుని తీసుకువెళ్లి అమ్మడానికి ప్రయత్నించగా ఒక వ్యక్తి వచ్చి కాపాడతాడు. అతను అయ్యప్ప అని ఆమె భావిస్తూ ఉంటుంది అయితే నిజంగా షన్ను నీ కాపాడింది అయ్యప్ప స్వామి నా? లేక ఆమెను వచ్చి కాపాడింది ఎవరు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ


పిల్లలు- భక్తి దేవుడిని దర్శించుకోవడం పిల్లలు ఇంటిని వదిలి వచ్చేయడం వంటి కాన్సెప్ట్ వినగానే మనకు దేవుళ్ళు అనే సినిమా గుర్తొస్తుంది. గతంలో ఇదే కథతో మరికొన్ని సినిమాలు కూడా వచ్చాయి. అదే విధంగా అయ్యప్ప స్వామి మీద భక్తితో బాలలు చేసిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే ఈ సినిమా కూడా అదే కోవలో సాగుతూ ఉంటుంది. సాధారణంగా రజస్వల కాని ఆడపిల్లలను మాత్రమే శబరిమలకు అనుమతిస్తూ ఉంటారు, కాబట్టి 10 ఏళ్లలోపు ఆడపిల్లలు మాత్రమే శబరిమల దర్శనానికి వస్తూ ఉంటారు. మొదటిసారిగా మాల వేసుకునే వారిని కన్న స్వామి అని పిలుస్తారు అని అందరికీ తెలిసిందే అయితే మొదటిసారి మాల వేసుకుని శబరిమల వచ్చే బాలికలను మాలికాపురం అనే పేరుతో పిలుస్తారు.


ఈ సినిమాలో కథ మొత్తం షన్ను అనే పాప చుట్టూ తిరుగుతుంది కాబట్టి మాలికాపురం అనే టైటిల్ నిర్ణయించారు. షన్ను మాలికాపురంగా మారి అయ్యప్పను దర్శించుకోవడం కోసం మాల ధరించడంతో కథ ఎమోషనల్ గా మొదలవుతుంది. తరువాత తండ్రి ఊహించని విధంగా చనిపోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోతుంది కానీ అయ్యప్ప స్వామి మీద ఉన్న ప్రేమతో ఎలా అయినా దర్శించాలని ఉద్దేశంతో తనకు సోదరుడు వరుసయ్యే బుజ్జిని తీసుకుని శబరిమల బయలుదేరి వెళ్లడం ఆసక్తికరంగా ఉంటుంది. అలా వారు ప్రయాణిస్తున్న సమయంలో పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మేసే ముఠాలోని వ్యక్తి వీరిని వెంటాడడం ఆ క్రమంలో అయ్యప్ప పేరు గల ఒక వ్యక్తి వచ్చి అండగా నిలవడంతో కథ ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. చివరికి పిల్లలు అయ్యప్ప స్వామిని దర్శించి తమ ఇంటికి ఎలా చేరారు అనేది ఈ సినిమా. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో అనేక సినిమాలు వచ్చాయి అవన్నీ కూడా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ చూరగొన్నాయి. ఈ సినిమా కూడా దాదాపుగా అలాగే ఆసక్తికరంగా సాగిందని చెప్పక తప్పదు.


నటీనటులు నటీనటుల విషయానికొస్తే షన్ను అనే పాత్రలో దేవనంద అద్భుతంగా నటించింది. చిన్నారి అయినా తన పాత్రకు సంబంధించిన భావోద్వేగమైన నటనతో ప్రేక్షకులందరినీ మెప్పించింది. ఒక రకంగా సినిమా కథ మొత్తాన్ని ఆమె తన భుజస్కంధాల మీద మోసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తెలుగులో ఇప్పటికే కొన్ని సినిమాలతో దగ్గరైన ఉన్ని ముకుందన్ తనదైన శైలిలో నటించాడు. సినిమా నిడివి తక్కువే ఉండడంతో సినిమా మీద ప్రేక్షకులందరికీ ఆసక్తి కలిగిందని చెప్పక తప్పదు. ఇక సినిమాలోని మిగతా పాత్రల్లో నటించిన వారంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.


ఫైనల్ గా చెప్పాలంటే: ఈ మాలికాపురం ఒక డివోషనల్ జర్నీ. చిన్నపిల్లలు, అయ్యప్ప భక్తులు, దైవభక్తి ఉన్నవారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఒక సినిమా అనేకంటే ట్రావెల్ వ్లాగ్ లా ఉంటుంది కానీ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది, అయితే సినిమాగా ఇది అందరికీ నచ్చకపోవచ్చు.


Rating: 2.5/5


Also Read: Waltair Veerayya Day 12: వాల్తేరు వీరయ్య జోరు ఎక్కడా తగ్గట్లే.. ఎన్ని కోట్ల లాభమో తెలుసా?


Also Read: Veera Simha Reddy Day 13: మరింత డ్రాప్ అయిన వీర సింహారెడ్డి కలెక్షన్స్.. పఠాన్ ఎంట్రీతో ఇక ఇబ్బందే!   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook