Ravi Teja shaking his legs to Balakrishna's song  in Unstoppable Show: ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహ (Aha)లో స్టీమింగ్ అవుతోన్న 'అన్‌స్టాప‌బుల్‌' (Unstoppable) టాక్ షోకు నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య బాబు తన డైలాగ్స్, మాటలతో అన్‌స్టాప‌బుల్‌ షోను సక్సెస్ చేశారు. వరుసగా సెలెబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్ సినిమా దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి.. హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను ఇంటర్వ్యూలు చేసిన బాలకృష్ణ.. తాజాగా మరో స్టార్ హీరోను చేయనున్నారు. మాస్ మహారాజ్‌ రవితేజ (Ravi Teja)తో ఈ డిసెంబర్ 31న బాలయ్య బాబు సందడి చేయనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త సంవత్సరం కానుకగా వస్తున్న 'అన్‌స్టాప‌బుల్‌' తాజా ఎపిసోడ్‌కు మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) రానున్నారు. ఇందుకు సంబందించిన మరో ప్రోమో (Unstoppable Episode 7 Promo)ను ఆహ తాజాగా వదిలింది. ఇందులో బాలకృష్ణ పాటకు రవితేజ డాన్స్ చేశారు. మ్యూజిక్ రెడీ అని హోస్ట్ బాలయ్య బాబు అనగా.. వేయండి ట్రై చేద్దాం అని రవితేజ అంటాడు. యా అది స్పిరిట్ అని బాలకృష్ణ అనగానే.. సాంగ్ స్టార్ అవుతుంది. ఆ వెంటనే బాలకృష్ణ స్టయిల్‌లో మాస్ మహారాజ్ స్టెప్స్ వేశారు. ఇది చూసిన గోపీచంద్ నవ్వులు పూయిస్తారు. సాంగ్ అవ్వగానే బాలకృష్ణ చప్పట్లతో రవితేజను అభినందిస్తారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


Also Read: Indian Cricketers Educational Qualifications: హార్దిక్ స్కూల్.. కోహ్లీ, రోహిత్ ఇంటర్! హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఎవరిదో తెలుసా?


నిజానికి ఈ ఎపిసోడ్ డిసెంబర్ 24న విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో డిసెంబర్ 31న రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. రవితేజ, గోపీచంద్ మలినేని ఎపిసోడ్‌కు సంబందించిన ప్రోమో ఇదివరకే ఒకటి విడుదలయింది. నీకు నాకు పెద్ద గొడవ అయ్యిందంటగా అని బాలకృష్ణ అనగా.. పని పాట లేని డాష్ నా డాష్ గాళ్లకు ఇదే పని అని రవితేజ అన్నారు. దాంతో వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయన్న వార్తలకు పులిస్టాప్ పడ్డాయి. రవితేజ, బాలకృష్ణ ఎప్పుడూ హుషారుగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఒకే వేదికపై ఉంటే ఆ రచ్చే వేరు. ఫాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. 




శరత్ మాండవ దర్శకత్వంలో రవితేజ (Ravi Teja) 'రామారావు ఆన్ డ్యూటీ' (Ramarao on Duty) అనే సినిమా చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik), రజిషా విజయన్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా.. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. దానికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 


Also Read: Disha Patani: అడుక్కుతినేవాళ్లు కూడా అలాంటి డ్రెస్ వేసుకోరు-దిశా పటానీపై నెటిజన్ల ట్రోలింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి