Indian Cricketers Educational Qualifications: హార్దిక్ స్కూల్.. కోహ్లీ, రోహిత్ ఇంటర్! హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఎవరిదో తెలుసా?

కొంతమంది టీమిండియా ప్లేయర్స్ క్రీడలు, చదువులను బ్యాలెన్స్ చేసుకుంటూ.. అత్యున్నతమైన చదువులు చదివారు. మరికొంతమంది మాత్రం స్కూల్, ఇంటర్‌తోనే సరిపెట్టుకున్నారు. మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఎంబీఏ కంప్లీట్ చేశారు. భారత క్రికెట్ చరిత్రలో హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ద్రవిడ్‌దే.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2021, 01:10 PM IST
  • 12వ తరగతి వరకే సచిన్ టెండూల్కర్
  • ఇంటర్ వరకే కోహ్లీ, రోహిత్
  • హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ద్రవిడ్‌దే
Indian Cricketers Educational Qualifications: హార్దిక్ స్కూల్.. కోహ్లీ, రోహిత్ ఇంటర్! హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఎవరిదో తెలుసా?

IND vs SA: Indian Cricketers Educational Qualification: చదువు, క్రీడ.. ఈ రెండింటినీ ఓకే సమయంలో మెయిన్‌టైన్ చేయడం చాలాచాలా కష్టం. చదువు, క్రీడలలో ఒకటి కావాలనుకుంటే.. మరొకదాన్ని త్యాగం చేయక తప్పదు. ఇది వినడానికి కష్టంగా ఉన్నా.. ఇదే అక్షర సత్యం. తమ ఇష్టమైన ఆట కోసం చదువులను మధ్యలోనే అపేసి కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు ప్రేరణగా మారారు మన టీమిండియా క్రికెటర్లు (Indian Cricketers). అయితే కొంతమంది ప్లేయర్స్ క్రీడలు, చదువులను బ్యాలెన్స్ చేసుకుంటూ.. అత్యున్నతమైన చదువులు చదివారు. మరికొంతమంది మాత్రం స్కూల్, ఇంటర్‌తోనే సరిపెట్టుకున్నారు. చాలా మందికి టీమిండియా స్టార్ ఆటగాళ్లు ఏం చదువుకున్నారనే విషయం (Indian Cricketers Educational Qualification) తెలియదు. ఓసారి ఆ వివరాలు చూద్దాం. 

హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ ద్రవిడ్‌దే:
16 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 12వ తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగారు. చిన్న వయసులోనే స్టార్‌గా ఎదగడంతో పెద్ద చదువులు చదవలేకపోయారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ డిగ్రీ పూర్తి చేశారు. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయగా.. హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ ఎంబీబీఎస్‌ను మధ్యలోనే వదిలేశారు. మాజీ పేసర్ జహీర్ ఖాన్ 12వ తరగితి వరకే చదివారు. మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఎంబీఏ కంప్లీట్ చేశారు. భారత క్రికెట్ చరిత్రలో హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ద్రవిడ్‌దే. 

డిగ్రీ పూర్తి చేసిన ధోనీ:
టీమిండియా ప్రపంచకప్‌ల హీరో యువ రాజ్ సింగ్ 12వ తరగతి వరకే చదువుకున్నారు. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) డిగ్రీ పూర్తి చేశారు. స్పోర్ట్స్ కోటాలో రైల్వే కలెక్టర్‌గా ఉద్యోగం చేసిన మహీ.. ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్కూల్ వరకే చదివారు. ఇక మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా డిగ్రీ పూర్తిచేశారు. మరో మాజీ పేసర్ అజిత్ అగార్కర్ కూడా డిగ్రీ పట్టా పొందారు. 

Also Read: Samantha: గోవాలో బెస్ట్‌ ఫ్రెండ్‌తో సమంత ఎంజాయ్.. సామ్ బికినీ అందాలు మాములుగా లేవుగా!!

12వ తరగతి వరకే కోహ్లీ, రోహిత్:
ప్రస్తుత ఆటగాళ్లలో టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 12వ తరగతి వరకు చదువుకున్నారు. 2008లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విరాట్.. ఢిల్లీలోని విశాల్ భారతి పబ్లిక్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను అభ్యసించారు. పరిమిత ఓవర్ల సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) ఇంటర్ పూర్తిచేశారు. రిజ్వి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కళశాలలో హిట్‌మ్యాన్ చదుకున్నారు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఇంటర్ వరకే చదివారు. అయితే ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా, స్కూల్ వరకే చదివారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఇంటర్ వరకు వచ్చారు.

రహానేకు డిగ్రీ పట్టా:
స్టార్ ఓపెనర్ లోకేష్ రాహుల్ (KL Rahul) డిగ్రీ పూర్తిచేశారు. సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే (Ajinkya Rahane)కు డిగ్రీ పట్టా ఉంది. రిజ్వి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) బిటెక్ కంప్లీట్ చేశారు. చెన్నైలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో యాష్ బిటెక్ డిగ్రీ పొందారు. నయా వాల్ ఛతేశ్వర్ పుజారా కరస్పాండెన్స్ ద్వారా బీబీఏ పూర్తి చేశారు. ఇక ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) జైన్ యూనివర్సిటీలో చదివారు. 

Also Raed: Covid 19: దేశంలో కొత్తగా 6358 కరోనా కేసులు-653కి చేరిన ఒమిక్రాన్ కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News