Trolls on Disha Patani: సెలబ్రిటీలంటేనే ఓ ప్రత్యేకమైన సెక్షన్. సెలబ్రిటీల మాటలైనా.. వాళ్లు ధరించే దుస్తులైనా... వాళ్లకు సంబంధించి ఏ విషయమైనా సరే జనం క్యురియాసిటీతో గమనిస్తుంటారు. నచ్చితే వాళ్ల స్టైల్, ఫ్యాషన్‌ను ఫాలో అవుతారు... లేదంటే ఛీ కొడుతారు. ముఖ్యంగా సెలబ్రిటీల ఫ్యాషన్ ఫెయిల్ అయితే ట్రోల్స్ మామూలుగా ఉండవు. తాజాగా దిశా పటానీకి ఇదే పరిస్థితిఎదురైంది. ఇటీవల ఆమె ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు.
ఇటీవల దిశా పటానీ ఎయిర్‌పోర్టులో దర్శనమివ్వగా... దానికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఫోటోగ్రాఫర్ మానవ్ మంగ్లానీ సోమవారం(డిసెంబర్ 27) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందులో దిశా పటానీ గోధుమ రంగు టాప్, బ్లూ కలర్ రిప్డ్ జీన్స్‌లో కనిపించింది. మోకాళ్ల భాగంలో ఆ జీన్స్ పూర్తిగా చిరిగిపోయినట్లు ఉంది. దిశా పటానీ దాన్ని ఫ్యాషన్‌గా భావించినట్లుంది.. కానీ నెటిజన్లు మాత్రం ఆమెను విపరీతంగా తిట్టిపోస్తున్నారు. 'అడుక్కునేవాళ్లు కూడా ఇలాంటి దుస్తులు ధరించరు.' అని విమర్శిస్తున్నారు. 'ఎంత పేదరాలు.. అందుకే ఇలాంటి దుస్తులు వేసుకుంది. నా దేశానికి ఏమైంది.' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్.. ఎందుకిలా ఎప్పుడూ ఒళ్లంతా చూపించడం...' అని కామెంట్ చేశాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. 'యోధ' సినిమాలో (Bollywood) తన పాత్రకు సంబంధించిన షూట్‌ను దిశా పటానీ ఇటీవలే పూర్తి చేసింది. ఈ సినిమాలో సిద్దార్థ మల్హోత్రా, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది నవంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది.
Also Read: హార్దిక్ స్కూల్ వరకే.. కోహ్లీ, రోహిత్ ఇంటర్! హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఎవరిదో తెలుసా?!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook